కరువుపై మేలు కొలుపు..ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో పై కళారూపాల ద్వారా చైతన్యం

కరువుపై మేలు కొలుపు..ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నినో పై కళారూపాల ద్వారా చైతన్యం
  •     విపత్కర పరిస్థితులపై సర్కార్​ అలర్ట్​
  •     ముందస్తు జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు 
  •     నీటి పొదుపు, కరెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదా, ప్రత్యామ్నాయ సాగుపై విస్తృత ప్రచారం
  •     కలెక్టర్ల పర్యవేక్షణలో పల్లెపల్లెనా ప్రదర్శనలు.. 
  •     ఉద్యమస్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్తాం: సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్నెల గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: వాతావరణ మార్పులు, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను సమర్థంగా అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు రెడీ అయ్యింది. ప్రజలను అప్రమత్తం చేసి నష్ట తీవ్రతను తగ్గించాలనే ఆలోచనతో ముందుకెళ్తోంది. వర్షపాతంలో హెచ్చుతగ్గులు, భూగర్భ జలాలు అడుగంటడం, సాగు, తాగునీటి ఎద్దడి, విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సవాళ్లను అధిగమించేందుకు సాంస్కృతిక సారథి ద్వారా చైతన్య కార్యక్రమాలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించింది. ప్రభుత్వ భాషా సాంస్కృతికశాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ సమన్వయంతో పల్లెల్లో కళాకారుల ద్వారా ఎల్​నినో ప్రభావానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేలా ప్లాన్ చేసింది. పాటలు, మాటలు, స్కిట్లు, కళాజాత ప్రదర్శనల ద్వారా గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

550 మంది కళాకారులకు స్పెషల్ ట్రైనింగ్.. 

ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినో ప్రభావం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంస్కృతిక సారథికి చెందిన దాదాపు 550 మంది కళాకారులకు ప్రభుత్వం ఇప్పటికే నిపుణులతో స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. వాతావరణ మార్పుల తీవ్రత, భూగర్భ జలాల క్షీణత, నీటి పొదుపు, అనవసర విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగానికి చెక్ పెట్టడం, పశువుల సంరక్షణ వంటి అంశాలపై కళాకారులకు అవగాహన కల్పించారు. గ్రామీణ ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో జానపద బాణీల్లో ప్రత్యేక పాటలు, స్కిట్లను రూపొందించారు. పల్లె సుద్దులు, ఒగ్గు కథలు, నాటికలు, కవితల రూపంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల వారీగా షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఏ రోజు, ఏ సమయం, ఏ ఊరులో కళాకారుల ప్రదర్శనలు ఉంటాయనేది అధికారికంగా వెల్లడించనున్నట్లు సాంస్కృతిక శాఖ ఆఫీసర్లు పేర్కొన్నారు. 

కలెక్టర్ల ఆధ్వర్యంలో కళాజాతలు..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ, ఇంధన, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖల సమన్వయంతో, కలెక్టర్ల పర్యవేక్షణలో కళాజాతలను నిర్వహించనున్నారు. ప్రకృతి ప్రతికూలతలను పూర్తిగా నివారించలేకపోయినా, ముందుస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమైంది. కాగా, వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశమున్నందున తాగు, సాగునీటిని పొదుపుగా వాడుకోవడం, ప్రతి నీటిబొట్టునూ ఒడిసిపట్టే పద్ధతులపై కళాకారులు చైతన్యం కల్పిస్తారు. అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులు, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువైన ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల వైపు అన్నదాతలు మళ్లేలా సూచనలు చేస్తారు. పీక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేళల్లో విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, అనవసర వినియోగానికి అడ్డుకట్ట వేయడంపై అవగాహన పెంపొందిస్తారు. ఎండలబారిన పడకుండా మూగ జీవాలకు నీడ, తగినంత తాగునీరు కల్పించడం, పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తుగా గడ్డి నిల్వలు చేసుకునేలా యజమానులకు మార్గదర్శనం చేస్తారు.

ఉద్యమ స్ఫూర్తితో ప్రజల్లోకి తీసుకెళ్తాం.. ​
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ముందుండే సాంస్కృతిక సారథి బృందాలు ఇప్పుడు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నినోపై ప్రజలను చైతన్యపరిచే బాధ్యతను తీసుకున్నాయని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెన్నెల గద్దర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కళాకారులు పల్లెలను ఏ విధంగానైతే చైతన్యపరిచారో, అదేస్ఫూర్తితో ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్​ ప్రకారం ఊరూరా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. సంప్రదాయ కళారూపాలతోపాటు సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తామన్నారు.