ముంబై: కోటక్ మహీంద్రా బ్యాంక్ నికర లాభం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 26 శాతం పెరిగి రూ.5,645 కోట్లకు చేరింది. స్టాండలోన్ ప్రాతిపదికన నికర లాభం 29 శాతం పెరిగి రూ.4,212 కోట్లకు చేరుకుంది. ప్రధాన ఆదాయ వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడమే ఈ లాభాలకు ప్రధాన కారణమని బ్యాంక్ తెలిపింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం పెరిగి రూ.8,459 కోట్లుగా నమోదైంది.
ఆర్బీఐ రాయితీ స్వాప్ సదుపాయం కింద సేకరించిన రూ.55,344 కోట్ల ఎఫ్‌సీఎన్‌ఆర్ (బీ) డిపాజిట్ల కారణంగా నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ 0.23 శాతం మేర తగ్గింది. ఈ పథకంలో భాగంగా బ్యాంకు రూ.16,110 కోట్ల లోన్లు కూడా మంజూరు చేసింది. ఈ ప్రభావం తీసేస్తే బ్యాంకు రుణ వృద్ధి 19 శాతం, డిపాజిట్ వృద్ధి 13 శాతంగా ఉండేదని తెలిపింది. కాసా డిపాజిట్ల వాటా 42.3 శాతం నుంచి 38.2 శాతానికి పడిపోయిందని కోటక్ బ్యాంక్ పేర్కొంది.
