హైదరాబాద్, వెలుగు: స్టీల్ ట్రేడింగ్ కంపెనీ కనకధార వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (కేవీపీఎల్), దాని డైరెక్టర్లపై నమోదైన రూ.326.49 కోట్ల భారీ బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్‌తో పాటు సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి పరిధిలోని 7 చోట్ల విస్తృత సోదాలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద కంపెనీ ఆఫీస్, డైరెక్టర్ల నివాసాల్లో ఈ తనిఖీలు జరిగాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఫిర్యాదుతో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది.
పీఎన్బీ, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలతో కూడిన బ్యాంకుల కన్సార్టియంకు ఈ సంస్థ కుచ్చుటోపీ పెట్టింది. బ్యాంక్ గ్యారెంటీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ నిధులను దుర్వినియోగం చేస్తూ.. నకిలీ స్టీల్ కొనుగోలు ఇన్వాయిస్లు, తప్పుడు రవాణా పత్రాలతో నిధులను దారిమళ్లించినట్లు తేలింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలతో పాటు రూ.15 లక్షల నగదు, పలు స్థిరాస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
