తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. మంత్రి కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 2026 సెప్టెంబర్ 07న జరిగిన ఈ ఘటనలో కారు డ్రైవర్ ను అరెస్టు చేశారు.
తమిళనాడు సాంఘిక సంక్షేమ మంత్రి జతదీశ్వరి కారు బైక్ ను ఢీకొట్టింది. కట్టంకులతూర్ దగ్గర తిరిచ్చి-చెన్నై జాతీయ రహదారిపై మధ్యాహ్నం 12.30 కు జరిగిన ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్న పోలీసులు.. కార్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమదు చేశారు.
చెంగల్పట్టు జిల్లాలోని కట్టంకులాతూర్ కు చెందిన ఇరియాన్బు ఈ ప్రమాదంలో చనిపోయాడు. హోండా డియో బైక్ పై వెల్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
కారు మంత్రి పేరు రిజిస్టర్ అయ్యి ఉంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు మంత్రి జగదీశ్వరి .. వృధునగర్ నుంచి ఎర్టిగా కారులో చెన్నై వెళ్తుంగా ఈ ప్రమాదం జరిగింది. కారును సీజ్ చేసిన పోలీసులు.. చిన్న అగ్ని అనే డ్రైవర్ ను అరెస్టు చేశారు.
