ఇండియాలో జపాన్ రాయబారి గంగా స్నానం చేసిన వీడియో వైరల్ గా మారింది. గంగా నదిలో మునగటం మరిచిపోలేని అనుభూతి అంటూ ట్వీట్ చేశారు. జపాన్ రాయబారి గంగా స్నానం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రిషికేశ్ దగ్గర గంగా నదిలో మునిగారు జపాన్ రాయబారి ఒనో కెయిచి. రిషికేశ్ దగ్గర గంగలో మూడు మునకలు వేశానని ట్వీట్ చేశారు.
జన్మాష్టమి సందర్భంగా వరం రోజుల పాటు ఇండియాలో గడిపిన ఆయన.. రిషికేశ్ లో గంగలో మునిగారు. వందల ఏళ్ల సంస్కృతి, సంప్రదాయాలతో ఇక్కడి ప్రజలు జన్మాష్టమి వేడుకలు నిర్వహించడం ఆంనందంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు.
భక్తి, కృతజ్ఞత, ఆధ్యాత్మికత, మానవత్వాన్ని ప్రజలు ప్రదర్శించడం గొప్పవిషయమని కొనియాడారు. మూడు మునకలు గంగా నదిలో మునిగిన ఆయన.. అందుకు సంబంధించిన వీడియో రిలీజ్ చేశారు.
గంగా నదిలో స్నానం సందర్భంగా ఆయన వేర్వేరు ఎమోషన్స్ తో దిగిన సెల్ఫీ ఇమేజ్ లను ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక ఇమేజ్ లో గంగా హారతి ఇచ్చినట్లుగా దీపం వెలిగించడం, మరో ఇమేజ్ లో కళ్లు మూసుకొని మొక్కుతూ స్నానం చేయడం, ఇంకో ఫోటోలో దీపం వెలిగించడం లాంటి పిక్స్ ను షేర్ చేశారు.
Finally, a full dip in the Ganges in Rishikesh—three times! 🙏
— ONO Keiichi, Ambassador of Japan (@JapanAmbIndia) September 6, 2026
Over the Janmashtami weekend, surrounded by people carrying on centuries-old faith and traditions, I felt a profound spiritual connection, along with awe, humility, and gratitude.
A truly unforgettable moment 🇮🇳 pic.twitter.com/A1SoVaDYuH
సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
గంగా స్థానం గురించి పోస్ చేశారో లేదో.. వెంటనే
ఆయన పోస్ట్‌కు ఆన్‌లైన్‌లో రియాక్షన్స్ వెల్లువెత్తాయి. అంబాసిడర్ ఉత్సాహాన్ని, భారతీయ సంప్రదాయాల పట్ల ఆయనకున్న గౌరవాన్ని ప్రశంసించారు. మీ సెలవులను ఆస్వాదించండి, అంబాసిడర్. స్థానికులు అందించే హిమాలయన్ చాయ్ తాగడం మర్చిపోకండి అని ఆ కామెంట్‌చేస్తున్నారు.
మరో యూజర్ కామెంట్ చేస్తూ.. రిషికేశ్ దగ్గర రాఫ్టింగ్ ట్రైచేయమని మరో యూజర్ సూచించారు. తాడు పట్టుకుని నదిలోకి దిగేందుకు పడవ నడిపే వ్యక్తి సహకరిస్తాడని.. ఇది చాలా థ్రిల్లింగ్ ఎక్స్ పీరియెన్స్ అని సూచించారు.
మరోవైపు గంగా నదిలో మూడు సార్లు మునగటం అంటే గట్స్ ఉండాలని.. కొందరు కామెంట్ చేస్తున్నారు. గంగా నదిలో మునగటం తొప్ప విషయం. ఇండియాలో జపాన్ అంబాసిడర్ గా లైఫ్ లాంగ్ మీరే ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేశారు.
