బౌద్ధమతం దక్కన్కు వ్యాప్తిచెందడం వల్ల, శాతవాహనుల కాలంలో అనేక స్తూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మించారు. స్తూపం గౌతమ బుద్ధుడు లేదా బౌద్ధ గురువుల అస్థికలు, అవశేషాలపై నిర్మించిన నిర్మాణాలను స్తూపాలు అంటారు. స్తూపం మొదటి మూల స్థానంలో అవశేషాలను నిక్షిప్తం చేసి చుట్టూ గుండ్రంగా పునాది నిర్మిస్తారు. దానిపై అర్ధగోళాకారపు డోమ్ను నిర్మిస్తారు. చుట్టూ ప్రదక్షిణపథం, ఆయక స్తంభాలు, ప్రాకారాలు, ద్వారాల చుట్టూ తోరణాలను నిర్మిస్తారు. చివరగా దీనిపైన హార్మిక ఛత్రం వంటిది అలంకరిస్తారు.
చైనా యాత్రికుడు హ్యుయన్ త్సాంగ్ ప్రకారం అశోకుడు ఆంధ్రలో శాలిహుండం, భట్టిప్రోలు, అమరావతి స్తూపాలను నిర్మించాడు. శాతవాహనులు ఈ స్తూపాలను పునర్నిర్మించి వాటిని విస్తరింపజేశారు. వాటిలో అమరావతి స్తూపం అత్యంత ముఖ్యమైంది. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన స్తూపం – భట్టిప్రోలు. ఇవి కాకుండా ఆంధ్రలో కొన్ని గుహాలయ స్తూపాలు కూడా ఉన్నాయి.
ఉదా: గుంటుపల్లి (పశ్చిమగోదావరి)
శంకరం గుహాలయ స్తూపాలు
స్తూపాలు మూడు రకాలుగా నిర్మిస్తారు.
ధాతుగర్భ స్తూపాలు: బుద్ధుడు, ఇతర బౌద్ధమతాచార్యుల శారీరక అవశేషాలపై నిర్మించిన స్తూపాలు.
ఉదా: అమరావతి, భట్టిప్రోలు.
పారిభోజక స్తూపాలు: గొప్ప బౌద్ధ భిక్షువులు వాడిన వస్తువులు లేదా మత గ్రంథాలపై నిర్మించే కట్టడాలు.
ఉద్దేశిక స్తూపాలు: లోపల ఏ వస్తువు నిక్షిప్తం చేయకుండా బుద్ధునిపై గల భక్తి భావాలను వెల్లడిస్తూ నిర్మించే స్తూపం.
►ALSO READ | అప్పడాలపై పాదముద్రలేంటి.. ఈ అచ్చులు చూస్తే తినేవాళ్లు కూడా వాంతులు చేసుకుంటారు!
