Vishwanath & Sons OTT Release: ఓటీటీలోకి 'విశ్వనాథ్ & సన్స్' .. సూర్య మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

Vishwanath & Sons OTT Release: ఓటీటీలోకి 'విశ్వనాథ్ & సన్స్' .. సూర్య మూవీ స్ట్రీమింగ్ ఎక్కడ అంటే?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ఫ్యామిలీ డ్రామా 'విశ్వనాథ్ & సన్స్'. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. సూర్య కెరీర్ లోనే మరో బెస్ట్ మూవీగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి కోలీవుడ్ లో ఆల్ టైమ్ హిట్‌ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 

అంతే కాదు  ఈ సినిమాతో గ్లామరస్ బ్యూటీ మమితా బైజు అరుదైన ఘనత సాధించింది. వరుసగా మూడోసారి కేవలం 30 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమాల్లో భాగమై, భారతీయ చలనచిత్ర రంగాన ఈ రికార్డు అందుకున్న ఏకైక నటిగా చరిత్రకెక్కింది.  ఇప్పుడు ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగించుకుని ఓటీటీ బాట పట్టింది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీ సందడి చేయనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యనాథ్ గారపాటి, నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 260 కోట్లకు పైగా వసూలు చేసి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

►ALSO READ | ఓమ్‌‌‌‌: ఛాప్టర్‌‌‌‌‌‌‌‌ 1 –ఉధిరం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. పవర్ పుల్ గా మమ్ముట్టి క్యారెక్టర్

తరతరాలుగా వస్తున్న కుటుంబ గౌరవం, వ్యాపార విలువలు,  తండ్రీకొడుకుల మధ్య ఉండే ప్రేమానురాగాలు, వైరుధ్యాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, కుటుంబ బంధాలను నిలబెట్టుకోవడానికి కథానాయకుడు చేసే పోరాటమే 'విశ్వనాథ్ & సన్స్'. భావోద్వేగాలు, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ సమ్మేళనంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రతి వర్గం ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.

ఈ చిత్రంలో భవానీ శ్రీ, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్, సునీల్ రెడ్డి, నాజర్, హర్ష చెముడు, హారిక కీలక పాత్రల్లో మెరిశారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, పాటలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఇప్పుడు ఓటీటీ డిజిటల్ స్క్రీన్లపై ఏ స్థాయి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.