గోల్డ్ స్పాట్  మూవీ గ్లింప్స్ రిలీజ్.. హార్ట్ టచింగ్ డైలాగులతో సినిమాపై మరింత క్యూరియాసిటీ

 గోల్డ్ స్పాట్  మూవీ గ్లింప్స్ రిలీజ్.. హార్ట్ టచింగ్ డైలాగులతో సినిమాపై మరింత క్యూరియాసిటీ

భిషేక్, కాజల్ చౌదరి  జంటగా వేణు కార్తికేయన్ దర్శకత్వంలో రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న చిత్రం ‘గోల్డ్ స్పాట్’.  ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఫేమ్   దుష్యంత్ కటికనేని  కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.  సోమవారం ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు.  హీరోయిన్ తన ప్రాణానికి ప్రాణమైన తన స్నేహితుడు రామ్ గురించి చెబుతూ ప్రారంభమైన వీడియో ఆసక్తికరంగా సాగింది.  ‘అమ్మను చిన్నప్పుడే తీసుకువెళ్లిపోయిన ఆ దేవుడే, నాకు రామ్‌‌‌‌ను పరిచయం చేశాడు.

 మనకు జీవితంలో ఎంతోమంది పరిచయమవుతుంటారు. కానీ ఒక్కరే జీవితంగా మారిపోతారు..’ అని కాజల్ చౌదరి చెప్పే డైలాగ్ హార్ట్ టచింగ్‌‌‌‌గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌కు మంచి రెస్పాన్స్ రాగా, ఈ గ్లింప్స్‌‌‌‌  సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. విజయ్ కృష్ణ లింగమనేని సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నరేన్ రెడ్డి సంగీతం అందిస్తున్నాడు.