మహేంద్రగిరి వారాహి తప్పక థియేటర్‌‌‌‌లో చూడాల్సిన సినిమా : అఖిల్

మహేంద్రగిరి వారాహి తప్పక థియేటర్‌‌‌‌లో చూడాల్సిన సినిమా : అఖిల్

‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం థియేటర్‌‌‌‌లో చూడాల్సిన సినిమా అని, ఇందులో  మంచి డివైన్ కంటెంట్ ఉందని, కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని హీరో అఖిల్ అక్కినేని అన్నాడు.  సుమంత్ హీరోగా నటించిన ఈ  చిత్రం సెప్టెంబర్ 11న విడుదలవుతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి హాజరైన అఖిల్ పైవిధంగా చెబుతూ టీమ్‌‌‌‌కు బెస్ట్ విషెస్ అందించాడు.

ఈ సినిమా వెనుక ఏదో దైవ శక్తి ఉన్నట్టు తాము ఫీలయ్యామని, ఆ శక్తితోనే  ఈ సినిమా నెక్స్ట్ లెవల్‌‌‌‌కు వెళ్లిందని సుమంత్ అన్నాడు. ఇందులో తాను ఒక ఇంపార్టెంట్ రోల్‌‌‌‌ చేశానని సిద్ధు జొన్నలగడ్డ చెప్పాడు. ఇలాంటి డివైన్ ఎలిమెంట్ ఉన్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని నటులు బ్రహ్మానందం, అలీ, మంజు భార్గవి, మీనాక్షి గోస్వామి అన్నారు. ‘సుబ్రహ్మణ్యపురం’ తర్వాత తాను రూపొందించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుందని దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పాడు. ఈ సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నామని నిర్మాతలు అన్నారు.