ఓమ్‌‌‌‌: ఛాప్టర్‌‌‌‌‌‌‌‌ 1 –ఉధిరం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. పవర్ పుల్ గా మమ్ముట్టి క్యారెక్టర్

ఓమ్‌‌‌‌: ఛాప్టర్‌‌‌‌‌‌‌‌ 1 –ఉధిరం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్.. పవర్ పుల్ గా మమ్ముట్టి క్యారెక్టర్

బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్‌‌‌‌ బిజీగా ఉన్నారు మమ్ముట్టి. సోమవారం ఆయన 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘మేళా’ మూవీ ఫస్ట్ లుక్‌‌‌‌తో పాటు ధనుష్‌‌‌‌తో కలిసి ఆయన నటిస్తున్న ‘ఓమ్‌‌‌‌: ఛాప్టర్‌‌‌‌‌‌‌‌ 1 –ఉధిరం’ స్పెషల్ గ్లింప్స్‌‌‌‌ను విడుదల చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌లో కీలక సూత్రధారి అయిన  శియ అలియాస్‌‌‌‌ కార్తికేయన్‌‌‌‌ (మమ్ముట్టి) కోసం ఓ వైపు ఇంటర్‌‌‌‌‌‌‌‌పోల్‌‌‌‌ ఆఫీసర్స్‌‌‌‌,  మరోవైపు టాస్క్‌‌‌‌పోర్స్‌‌‌‌ బలగాలు గాలిస్తుంటాయి.  అయితే తను మాత్రం ఇవేమీ పట్టనట్టు తాపీగా పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌లో కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు.

తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ ఎంత పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉండబోతోంది అనేది దర్శకుడు రాజ్‌‌‌‌కుమార్ పెరియసామి స్టైలిష్‌‌‌‌గా ప్రజెంట్‌‌‌‌ చేసిన తీరు, అందుకు సాయి అభ్యంకర్ ఇచ్చిన బ్యాగ్రౌండ్‌‌‌‌ మ్యూజిక్‌‌‌‌ హైలైట్స్‌‌‌‌గా నిలిచాయి. తెలుగు వెర్షన్‌‌‌‌ టీజర్‌‌‌‌‌‌‌‌కు మమ్ముట్టి సొంతంగా డబ్బింగ్ చెప్పడం విశేషం.  ‘‘గతాన్ని వదిలేస్తేనే భవిష్యత్తు బాగుంటుంది...  స్మగ్లర్‌‌‌‌‌‌‌‌నేగా అంత బంగారమైన క్యారెక్టర్ ఏమీ కాదు’ లాంటి డైలాగ్స్‌‌‌‌ ఆకట్టుకున్నాయి.  సాయి పల్లవి, శ్రీలీల, మమ్ముట్టి, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శ్రద్ధా అగర్వాల్, ధనుష్, అజ్మత్ జగ్మగ్ నిర్మిస్తున్నారు.  అక్టోబర్ 16న విడుదల కానుంది.