ఓరే బుడ్డోడా అంత దూరం సిక్సర్ కొడతారా?.. వైభవ్ 102 మీటర్ల సిక్స్‌తో స్టేడియం షేక్!

ఓరే బుడ్డోడా అంత దూరం సిక్సర్ కొడతారా?.. వైభవ్ 102 మీటర్ల సిక్స్‌తో స్టేడియం షేక్!

Vaibhav Suryavanshi: జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఏదో పెద్ద ప్లాన్ చేసి, వీడు చిన్నపిల్లోడు కదా, క్రీజు వదిలి ముందుకు వస్తున్నాడు.. షార్ట్ బాల్ వేసి బురిడీ కొట్టిద్దాం అనుకున్నాడు. పాపం ఆయనకి ఏం తెలుసు, ఆ ప్లాన్ తనకే రివర్స్ అవుతుందని! ఈ 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ క్షణంలో మైండ్ మార్చేసి, బంతిని గుంజి కొడితే.. అది వెళ్లి నేరుగా స్టేడియం పైకప్పు మీద పడ్డది. దీంతో ఆ సిక్సు ఏకంగా 102 మీటర్ల పోయింది. ఆ షాట్ చూసి జింబాబ్వే బౌలర్లు, మైదానంలో ఉన్న జనాలు ఇదేందయ్యా ఇది అని నోరెళ్లబెట్టారు. 

వైభవ్ ఔట్.. జింబాబ్వే రిలీఫ్: 
కేవలం 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి, జింబాబ్వే బౌలర్లని ఊతుకి ఆరేసిన వైభవ్.. 81 పరుగుల దగ్గర అవుటై సెంచరీ కొద్దిలో మిస్సయ్యాడు, దీంతో జింబాబ్వే జట్టు మాత్రం హమ్మయ్యా.. ఈ పోరగాడు అవుట్ అయ్యాడు అని ఊపిరి పీల్చుకున్నారు. సెంచరీ చేయకపోతేనేం, ఇండియా 20 ఓవర్లలోనే 192 పరుగులు చేసింది. 

15 ఏళ్లకే రికార్డులు: 
15 ఏళ్ల వయసులో మనవాళ్లంతా హోమ్‌వర్క్‌లు, ఎగ్జామ్ టెన్షన్లలో ఉంటే.. ఈ వైభవ్ సూర్యవంశీ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డులు తిరగరాస్తున్నాడు. 16 ఏళ్లు కూడా నిండకుండానే అంతర్జాతీయ టీ20ల్లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ కుర్రాడి బ్యాటింగ్ చూస్తుంటే, ముందు ముందు పెద్ద పెద్ద జట్ల బౌలర్లకు కూడా నిద్రలేకుండా చేసేలా కనిపిస్తున్నాడు.