సింగిల్స్‌‌‌‌‌‌‌‌కు ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ బంపర్ ఆఫర్.. ఫిన్నిష్ డిన్నర్ డేట్ పేరిట క్యాంపెయిన్

సింగిల్స్‌‌‌‌‌‌‌‌కు ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ బంపర్ ఆఫర్.. ఫిన్నిష్ డిన్నర్ డేట్ పేరిట క్యాంపెయిన్
  •     ప్రపంచవ్యాప్తంగా 16 మందికి చాన్స్
  •     ఫ్లైట్​ టికెట్లు, వసతి, ఫుడ్ అన్నీ ఫ్రీ  

హెల్సింకి: ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశంగా గుర్తింపు పొందిన ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ సింగిల్స్ కోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆ దేశ పర్యాటక బోర్డు విజిట్ ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ ‘ఫిన్నిష్ డిన్నర్ డేట్’ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది.

 ప్రపంచవ్యాప్తంగా 16 మంది సింగిల్స్‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేసి తమ దేశ సందర్శన నిమిత్తం ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ పర్యటనలో భాగంగా ఎంపికైన విజేతలు ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ సాంప్రదాయ వంటకాలను ఆస్వాదిస్తూ స్థానికులతో పరిచయాలు పెంచుకోవచ్చు.

పర్యటన వివరాలు

ఈ పర్యటన 2027, ఫిబ్రవరి 9 నుంచి ఫిబ్రవరి19 వరకు జరగనుంది. విజేతలకు విమాన టికెట్లు, వసతి, భోజనం, ఇతర కార్యక్రమాల ఖర్చులన్నింటినీ పర్యాటక బోర్డే భరిస్తుంది. రాజధాని హెల్సింకితో పాటు టాంపెరే సిటీల్లో స్థానిక సింగిల్స్‌‌‌‌‌‌‌‌తోగ్రూప్ డిన్నర్ డేట్స్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రముఖ చెఫ్‌‌‌‌‌‌‌‌లు సిద్ధం చేసే వైల్డ్ ఫిష్, బెర్రీలు, ఫారెస్ట్ మష్రూమ్‌‌‌‌‌‌‌‌లతో కూడిన ప్రత్యేకమైన వంటకాలను వడ్డించనున్నారు. 

ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ సూపర్‌‌‌‌‌‌‌‌మార్కెట్లలో ప్రాచుర్యం పొందిన సింకూకోరి( సింగిల్స్ బాస్కెట్) అనే డేటింగ్ ట్రెండ్ ఆధారంగా ఈ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశారు. అక్కడ పరిచయాలకు సిద్ధంగా ఉన్న 
సింగిల్స్ సూపర్‌‌‌‌‌‌‌‌ మార్కెట్లలో పింక్ కలర్ బాస్కెట్లను ఉపయోగిస్తుంటారు. దీన్ని నుంచి స్ఫూర్తి పొంది ఈ క్యాంపెయిన్‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశారు.  

దరఖాస్తు విధానం 

ఈ పర్యటనకు 18 ఏండ్లు నిండిన ఏ దేశ పౌరులైనా దరఖాస్తు చేసుకోవచ్చు, అయితే, ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ నివాసితులకు ఇందులో అవకాశం లేదు. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు మీరు డిన్నర్ డేట్‌‌‌‌‌‌‌‌లో ఏం వడ్డిస్తారు? ఎందుకు? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఇంగ్లిష్​లో ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. 

ఆ వీడియోను తమ సోషల్ మీడియా అకౌంట్‌‌‌‌‌‌‌‌లో (టిక్‌‌‌‌‌‌‌‌ టాక్, ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, యూట్యూబ్) ఫిన్నిష్ డిన్నర్ డేట్అనే హ్యాష్‌‌‌‌‌‌‌‌ట్యాగ్‌‌‌‌‌‌‌‌తో పోస్ట్ చేస్తూ విజిట్ ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌ను ట్యాగ్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఫిన్నిష్ సమయం ప్రకారం 2026 నవంబర్ 10న ఉదయం 11:59 గంటల వరకు గడువు ఉంది. ఎంపికైన16 మంది విజేతల వివరాలను 2026,  డిసెంబర్ 1న విజిట్ ఫిన్‌‌‌‌‌‌‌‌లాండ్ అధికారిక ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్, టిక్‌‌‌‌‌‌‌‌టాక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌లో ప్రకటిస్తారు.