ఆయిల్‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌ లో తెలంగాణ రికార్డు..TG ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఫెడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌లో 44.60 శాతం వృద్ధి

ఆయిల్‌‌‌‌‌‌‌‌ పామ్‌‌‌‌‌‌‌‌ లో తెలంగాణ రికార్డు..TG ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఫెడ్‌‌‌‌‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌లో 44.60 శాతం వృద్ధి
  •     ఒకే ఏడాదిలో 4.74 లక్షల టన్నుల గెలల ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌   

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ సాగు, ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ రంగాల్లో టీజీ ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫెడ్‌‌‌‌‌‌‌‌ 2025-–26లో రికార్డు స్థాయి ప్రగతి సాధించింది. గతేడాదితో పోలిస్తే గెలల ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌లో 44.60 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రభుత్వ రంగంలో తొలిసారిగా ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. 2024–-25లో 3.27 లక్షల టన్నుల గెలలను ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేయగా, 2025–-26లో ఈ పరిమాణం 4.74 లక్షల టన్నులకు చేరింది. అదనంగా 1.46 లక్షల టన్నుల ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ చేపట్టింది. అప్పారావుపేట, నర్మెట్ట తోటల నుంచి వచ్చిన దాదాపు 1.50 లక్షల టన్నుల గెలలను ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేసి 19.62 శాతం ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రాక్షన్‌‌‌‌‌‌‌‌ రేషియో సాధించింది. 

కొత్తగా ఏర్పాటు చేసిన నర్మెట్ట ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌ను పూర్తి సామర్థ్యంతో నిర్వహించడం ఈ వృద్ధికి దోహదపడింది.నెలవారీ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ కొత్త రికార్డు సృష్టించింది. ఒకే నెలలో అత్యధికంగా 50,150 టన్నుల గెలలను ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేసింది. గతేడాది నమోదైన 39,840 టన్నులతో పోలిస్తే 10,310 టన్నులు అధికం. రోజువారీ ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ సామర్థ్యం 1,650 టన్నుల నుంచి 1,850 టన్నులకు పెరిగింది. అశ్వారావుపేట యూనిట్‌‌‌‌‌‌‌‌ ఒక్కటే 1.01 లక్షల టన్నుల గెలలను ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ చేసింది. నెట్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి 22,788 టన్నుల నుంచి 33,182 టన్నులకు చేరగా, పామ్‌‌‌‌‌‌‌‌ కెర్నల్‌‌‌‌‌‌‌‌ ఆయిల్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి 5,075 టన్నుల నుంచి 5,853 టన్నులకు పెరిగింది.

ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ సామర్థ్యం మరింత పెంపు

ప్రస్తుతం అప్పారావుపేటలో 90 టీపీఏహెచ్‌‌‌‌‌‌‌‌, అశ్వారావుపేట, నర్మెట్టలో 30 టీపీఏహెచ్‌‌‌‌‌‌‌‌ సామర్థ్యంతో మూడు ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ యూనిట్లు పనిచేస్తున్నాయి. నర్మెట్ట యూనిట్‌‌‌‌‌‌‌‌ను భవిష్యత్తులో 120 టీపీఏహెచ్‌‌‌‌‌‌‌‌కు విస్తరించాలని భావిస్తోంది. అశ్వారావుపేటలో అదనంగా 60 టీపీఏహెచ్‌‌‌‌‌‌‌‌, బీచుపల్లి, మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌లో 30 టీపీఏహెచ్‌‌‌‌‌‌‌‌ చొప్పున సామర్థ్యంతో కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. కల్లూరుగూడెంలో 15 టీపీఏహెచ్‌‌‌‌‌‌‌‌ సామర్థ్యంతో నిర్మించిన యూనిట్‌‌‌‌‌‌‌‌ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. విజయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ వంట నూనెల ఉత్పత్తి, ప్యాకింగ్‌‌‌‌‌‌‌‌, పంపిణీని విస్తరించేందుకు ఆటోమేటెడ్‌‌‌‌‌‌‌‌ మెగా ఆయిల్‌‌‌‌‌‌‌‌ ప్యాకింగ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. మరోవైపు మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌ ఎవాపరేటర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లను జీరో లిక్విడ్‌‌‌‌‌‌‌‌ డిశ్చార్జ్‌‌‌‌‌‌‌‌ విధానంలో నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటోంది. ప్రాసెసింగ్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లు, గెలల సేకరణ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణను పటిష్టం చేసింది. 

రైతులకు రూ.1,100 కోట్ల చెల్లింపులు
ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ 2025-–26లో గెలల కొనుగోలుకు సంబంధించి దాదాపు రూ.1,100 కోట్లను చెల్లించింది. ఏడాది పొడవునా టన్నుకు సగటున రూ.23,100 ధర అందించింది. కొనుగోళ్లలో పారదర్శకత పెంచేందుకు కొత్త సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఒకే నెలలో దాదాపు 3.50 లక్షల ఆయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ మొక్కలను రైతులకు పంపిణీ చేసింది. ట్రైకోడెర్మా, వామ్స్‌‌‌‌‌‌‌‌ వంటి జీవ ఎరువులను 50 శాతం సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక రూపొందించింది.