మేం ఓడిపోలేదు..కావాలనే ఓడించారు : టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 

మేం ఓడిపోలేదు..కావాలనే ఓడించారు : టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ 

న్యూఢిల్లీ : బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడుతోందని, ‘సర్’ ​పేరుతో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను టార్గెట్​చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌‌‌‌లీలా మైదాన్ వేదికగా జరిగిన 'ఇండియా' కూటమి భారీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సీజేపీ నాయకత్వానికి, జెన్-జీ  కార్యకర్తలకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ, సమాజంలోని అన్ని వర్గాలు ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సర్​అనేది బీజేపీ పార్టీకి ఇస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రిలీఫ్గా’ మారిందని ఎద్దేవా చేశారు. తాము ఓడిపోలేదని, కావాలనే ఓడించారని ఆరోపించారు. తాము ప్రజాస్వామ్య బద్ధంగా పోరాడుతామని, బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

తాము ప్రాణాలైనా ఇస్తాం కానీ బెంగాల్‌‌‌‌ను దోచుకోవడానికి అనుమతించమని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం తీరును తప్పుపడుతూ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌‌‌‌పై సెటైర్లు వేశారు. పోలీసులను బీజేపీ మిత్రులుగా మార్చుకుందని, రాజకీయ అజెండా కోసం ఏజెన్సీలను, సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు.