హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని సర్కారు స్కూళ్లలో ఈ నెల 5న పేరెంట్స్ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్‌మెంట్–1 ఫలితాలు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై పేరెంట్స్‌తో చర్చించి, వారికి ‘హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు’ అందించనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ పంపించింది.
ఎస్ఏ–-1 పరీక్షల మార్కులను హెడ్మాస్టర్లు, టీచర్లు ఈ నెల 5వ తేదీలోగా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించింది. మార్కుల నమోదుతో పాటు క్లాస్, సబ్జెక్టు, విద్యార్థుల వారీగా ఫలితాలను విశ్లేషించి చదువులో వెనుకబడిన వారిని గుర్తించాలని సూచించింది. వారిలోని అభ్యసన లోపాలను అధిగమించేందుకు రెమిడియల్ టీచింగ్ చేపట్టాలని, అలాగే చురుగ్గా ఉన్న విద్యార్థుల కోసం ఎన్‌రిచ్‌మెంట్ యాక్టివిటీస్ రూపొందించాలని స్పష్టం చేసింది. వచ్చేనెల 5 న జరిగే మీటింగ్‌లో పేరెంట్స్‌కు ప్రోగ్రెస్ కార్డులు అందించి, వారి ప్రగతిని వివరించాలని టీచర్లను ఆదేశించింది.
