జ్యోతిష్యం:  మీన రాశిలో శుక్రడు..శని సంచారం.. ఆరు రాశుల వారి జీవితంలో మార్పులు

జ్యోతిష్యం:  మీన రాశిలో శుక్రడు..శని సంచారం.. ఆరు రాశుల వారి జీవితంలో మార్పులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలా మారినప్పుడు జీవరాశుల జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తాయి.  ఈ నెల (2026 మార్చి) 26 వ తేదీ వరకు మీన రాశిలో శుక్రుడు.. శని కలిసి సంచరిస్తాయి.శుక్రుడు ఐశ్వర్యానికి కారణంగా వ్యవహరిస్తే.. శని భగవానుడు  జీవితంలో కర్మ పలాలను అనుభవించేలా కష్ట.. సుఖాలను కలుగ జేస్తాడు.  ఈ రెండు గ్రహాలు కలసి మీన రాశిలో సంచరించడం వలన ఆరు (మేషం, సింహం, తుల, వృశ్చికం, మకరం, మీన)  రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.  ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . .  ! 

సిరిసంపదలకు, భోగభాగ్యాలకు, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడితో శనీశ్వరుడు మీననాశిలో కలవడం వలన చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. పెళ్లిళ్ల వ్యవహారాల్లో చికాకులు, కులాంతర, మతాంతర వివాహాలు, విదేశాల్లో ఉద్యోగాలు, సంప్రదాయానికి విరుద్దంగావ్యవహరించడం..అసాధారణ వ్యాపారాలు వంటివి జరిగే అవకాశం ఉంది. ఆరు రాశుల వారికి వీటిలో కొన్నిజరుగుతాయని అంటున్నారు పండితులు.  అంతేకాదు మిత్రులు పక్కదారి పట్టించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులుసూచిస్తున్నారు. 

మేషరాశి:  ఈ రాశి వారికి వ్యయ స్థానంలో శుక్రుడు.. శని  ఈ రెండు గ్రహాలు కలిశాయి.  దీనివలన అనవసరంగా ఖర్చులు పెరుగుతాయి. వీరి జీవన విధానంలో అనుకోకుండా మార్పులు సంభవిస్తాయి.  వివాహాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.   వ్యాపారస్తులు ఆచితూచి నిర్ణయం తీసుకోకపోతే నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు మిత్రుల మాటలు విని వ్యసనాలకు బానిసయ్యే  అవకాకాశాలున్నందున చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సింహరాశి:  రెండు కీలక గ్రహాలైన శుక్రుడు..శని అష్టమంలో  మీనరాశిలో కలవడం వలన ఈ రాశి వారు విదేశీయులతో ప్రేమలో పడే అవకాశం ఉంది.  విలాసవంతమైన జీవితం గడుతారు.  ప్రేమ వివాహం జరిగేందుకు అవకాశాలున్నాయి.  సరదాలకు.. సంతోషాలకు డబ్బును ఖర్చు చేస్తారు.  అయితే దంపతులు విషయంలో అభిప్రాయ బేధాలు వచ్చే అవకాశం ఉంది. కొత్త పరిచయాల వల్ల చెడు జరుగుతుందని పండితులు అంటున్నారు. 

తులారాశి:  మీనరాశిలో శుక్రుడు.. శని షష్టమ స్థానంలో  కలవడం వలన ఈ రాశి వారికి ఆదాయం పెరిగినా.. దానికంటే ఎక్కువుగా ఖర్చులు పెరుగుతాయి. విలాసవంతమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు.  ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శత్రువులు.. నమ్మక ద్రోహులు చెడు చేసే అవకాశం ఉన్నందున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. పాత స్నేహితులను వదిలి కొత్తవారితో స్నేహం చేస్తారు. అనవసర పరిచయాలు ఏర్పడటంతో సమాజంలో కొన్ని అవమానాలు ఎదుర్కోవలసి ఉంటుంది. 

వృశ్చికరాశి:  శుక్రుడు.. శని మీనరాశిలో పంచమస్థానంలో కలవడం వలన చేసే  ఆస్తి,, ఆర్థిక వ్యవహారాల్లో తప్పటడుగు వేసే అవకాశం ఉంది. మీరు చేసే పనులను చాలా మంది వ్యతిరేకిస్తారు.  పిల్లల విషయంలో అనేక సమస్యలు వస్తాయి.  పెద్దల ఇష్టం లేకుండానే పెళ్లి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది. చదివిన చదువుకు.. చేసే పనికి ఎలాంటి సంబంధం ఉండదు. డబ్బు ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు. 

మకరరాశి:  మీన రాశి తృతీయ స్థానంలో శుక్రడు.. శని కలవడం వలన ఈ రాశి వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది.  ఊహించని సంఘటనలే చోటు చేసుకుంటాయి.  నిరుద్యోగులు ఉద్యోగం లభిస్తుంది.  ఆర్థికంగా స్థిరత్వం లభించడంతో పాటు.. మీ ప్రేమ పెళ్లి పెద్దల అంగీకారంతో జరుగుతుంది.  విదేశాల్లో జాబ్​ ట్రై చేసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  అయితే అనుకోకుండా కొన్ని చెడు వార్తలు వినే అవకాశాలున్నాయి. 

మీనరాశి : ఈ రాశి వారికి మీన రాశిలో శుక్రడు.. శని కలవడం వలన వీరి జీవితంతో అనుకోనివి జరుగుతాయి.  అనుకున్నవి జరగవు.  ఆకస్మికంగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత.. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.  కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. జీవన విధానంలో మార్పులు జరుగుతాయి.  కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. విలాసాలకు.. వ్యసనాలకు డబ్బును అధికంగా ఖర్చు చేస్తారు.  అనుకున్నది ఒకటి.. అయింది ఒకటి అన్న చందంగా వీరి జీవితం కొసాగుతుందని పండితులు చెబుతున్నారు. 

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న  జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.