T20 World Cup: టీ20 ప్రపంచ కప్ 2026 సెమీఫైనల్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఆరంభంలోనే భారత్ జట్టుకి బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 7 బంతులు ఆడి కేవలం 9 పరుగులకే విల్ జాక్స్ బౌలింగ్ లో ఔట్ అయి, పెవిలియన్ బాట పట్టాడు. కానీ మరో ఓపెనర్ సంజు శాంసన్ మాత్రం ఆగేది లేదు అంటూ బ్యాటింగ్ లో ఇంగ్లీస్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. దీంతో భారత్ 10 ఓవర్లు ముగిసే సమయానికి 73/1కి చేరుకుంది. అయితే, 15 పరుగుల వద్ద శాంసన్ ఇచ్చిన క్యాచ్ ని ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వదిలి పెట్టిన తర్వాత అతను ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకం బాదేశాడు.
అయితే ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ తీసుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు.. 10 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఇషన్ కిషన్ ( 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు ) కాసేపు అద్భుతమైన బ్యాటింగ్ చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అవుట్ కాగా, ప్రస్తుతం క్రీజులో సంజు శాంసన్ (75), శివమ్ దూబే (3) ఉన్నారు. కాగా, 11 ఓవర్లు ముగిసే సమయానికి 130/2 చేసిన టీమిండియా.
Sanju Samson in form and fire today at Wankhede stadium.#INDvENGpic.twitter.com/fghBranocG
— Ashu (@AshuKharwa66211) March 5, 2026
►ALSO READ | నీ సేవలు ఇక చాలు: టీ20 కెప్టెన్సీ నుంచి రషీద్ ఖాన్ ఔట్
ఇరు జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(w), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(w), హ్యారీ బ్రూక్(c), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
