Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026లో తన బ్యాటింగ్ విధ్వంసంతో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల భారత బ్యాటింగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi)పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, అతడి అద్భుత ప్రదర్శన కంటే ప్రస్తుతం అతడి వయస్సు చుట్టూ తిరుగుతున్న వివాదమే ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం బ్రెట్ లీ (Brett Lee) స్పందిస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి.
వయస్సుతో మాకేంటి పని?.. ఆ కుర్రాడు తోప్:
బీర్ బైసెప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన బ్రెట్ లీ.. వైభవ్ వయస్సుపై జరుగుతున్న ప్రచారాన్ని పూర్తిగా కొట్టిపారేశాడు. ప్రపంచమంతా అతనికి నిజంగానే 15 ఏళ్లా కాదా అని అడుగుతోంది. కానీ నాకు ఆ వయస్సుతో అసలు సంబంధం లేదు.. అతనికి 15 ఉంటే ఏంటి, 17 లేదా 18 ఉంటే ఏంటి? ఆ కుర్రాడు అద్భుతంగా క్రికెట్ ఆడగలడు.. టీమిండియాకు దొరికిన అరుదైన రత్నం అతను అని ప్రశంసించాడు.
►ALSO READ | అలా ఆడకూడదు మియా: సిరాజ్‌కి కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పాఠాలు.. వీడియో వైరల్!
సూర్యవంశీకి నేను బౌలింగ్ వేస్తేనా:
ఒకవేళ తాను వైభవ్‌కు బౌలింగ్ వేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో బ్రెట్ లీ వివరించాడు. షార్ట్ బాల్స్ బాగా ఆడే బ్యాటర్లంటే నాకు చాలా ఇష్టం.. నేను అతనికి ఛాతీ పైకి గట్టిగా బౌన్సర్ వేసేవాడిని. నా బౌలింగ్‌లో అతను సిక్స్ కొట్టినా నేను అస్సలు తగ్గను, మళ్లీ ఇంకో షార్ట్ బాల్ వేసి ఛాలెంజ్ చేస్తాను అని సరదాగా వ్యాఖ్యానించాడు. అలాగే వైభవ్‌ను ఇప్పటి నుంచే విపరీతమైన ఒత్తిడికి గురి చేయకుండా, చిన్నపిల్లవాడిలా స్వేచ్ఛగా ఆడనివ్వాలని సూచించాడు.
ఐపీఎల్‌లో విధ్వంసం.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్:
* ఐపీఎల్ 2026 రచ్చ: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 97 రన్స్ చేసిన మ్యాచ్‌లో ఆసీస్ గన్ బౌలర్లు గాల్లోకి విసిరిన స్పీడ్ బాల్స్‌ను సైతం మైండ్ బ్లాక్ అయ్యేలా హుక్ షాట్లతో సిక్సర్లుగా మలిచాడు.
* టీ20ఐ ఎంట్రీ: ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో కాస్త నెమ్మదిగా మొదలు పెట్టినా, జింబాబ్వే పర్యటనలో అద్భుతంగా పుంజుకుని ఏకంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు.
