రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (రైట్స్) దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్).
మొత్తం ఖాళీలు: 24.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ / టెక్నాలజీలో ఫుల్-టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్/ రైల్వేస్, మెకాట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ కాంబినేషన్‌తో డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా అప్లై చేయవచ్చు. అలాగే, జనరల్ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 32 ఏళ్లు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఆగస్టు 17.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్వ్యూ 40 శాతం వెయిటేజీ కేటాయించారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.rites.comను సందర్శించండి.
