Shubman Gill: శ్రీలంకతో ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్ కి సమయం దగ్గర పడుతుండటంతో భారత జట్టులో గాయాల సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు ఎట్టకేలకు ఒక శుభవార్త లభించింది. ప్రాక్టీస్ సెషన్‌లో కుడిచేతి వేలికి గాయమై తొలి టెస్టుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరమవుతాడనే వార్తలతో తీవ్ర ఆందోళనలో ఉన్న ఫ్యాన్స్‌కు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొన్ని ఫొటోలు బిగ్ రిలీఫ్ ఇస్తున్నాయి.
నెట్స్‌లో ప్రత్యక్షమైన కెప్టెన్!
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తుంది. అతడు తిరిగి నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించగా, ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొలంబో వేదికగా శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉందని క్రీడా పండితులు భావిస్తున్నారు.
సరికొత్త అప్‌డేట్స్:
* శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ: వేలి గాయం కారణంగానే మొదటి రెండు రోజుల ఆటకూ దూరమైన గిల్, మూడో రోజు ఫీల్డింగ్‌కు రాకపోయినా బ్యాటింగ్ చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
* కేఎల్ రాహుల్ కెప్టెన్సీ: శుభ్‌మన్ గిల్ గైర్హాజరీలో శ్రీలంక ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్‌కు కేఎల్ రాహుల్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు.
* గాయపడిన ఇతర ప్లేయర్లు: ఫామ్‌లో ఉన్న జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్‌లు ఇప్పటికే గాయాల వల్ల సిరీస్ మొత్తానికి దూరం కాగా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా మొదటి టెస్ట్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
►ALSO READ | ఎవరినో ఒకరిని బలిపశువును చేయకండి: భారత ఆటగాళ్ల గాయాలపై వీవీఎస్ లక్ష్మణ్ క్లారిటీ
