'గమ్ గమ్ గణేశ'మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నయన్ సారిక. ఆ తర్వాత కిరణ్ అబ్బవరంతో కలిసి 'ఆయ్', 'క' సినిమాల్లో అద్భుత మైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇటీవల విడుదలైన రొమాంటిక్ కామెడీ 'విష్ణు 'విన్యాసం' మూవీలోనూ జున్ను (మనీషా) పాత్రతో అలరించింది. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది.
ప్రస్తుతం, నయన్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో సంగీత్ శోభన్ తో జంటగా నటించిన 'రాకాస' మూవీ ఒకటి. మానసశర్మ డైరెక్టర్. ఉమేశ్ కుమార్ బన్సాల్ తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఇప్పటికే మేకర్స్ ప్రచా రాన్ని ముమ్మరం చేశారు. ఈ మూవీపై అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.
అలాగే మోహన్ లాల్ నటించిన 'వృషభ' షూటింగ్ లోనూ సారిక బిజీగా ఉంది. ఇక ఇటీవల రిలీజ్ అయ్యిన 'విష్ణు విన్యాసం' చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈసందర్భంగా అభిమానులను ఉద్దేశించి ఇం ట్రెస్టింగ్ పోస్ట్ చేసింది ఈ బ్యూటీ.. 'జున్ను మీ అందరినీ చాలా ప్రేమిస్తుంది. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్' అంటూ పోస్ట్ చేసింది.
