India vs  England: టీమిండియా vs  ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. లైవ్ అప్డేట్స్

India vs  England: టీమిండియా vs  ఇంగ్లాండ్ మధ్య హై-వోల్టేజ్ పోరు.. లైవ్ అప్డేట్స్

* ముగిసిన తొలి ఇన్సింగ్స్.. 20 ఓవర్లలో 253 పరుగులు చేసిన భారత్.. ఇంగ్లాండ్ టార్గెట్ 254 పరుగులు.. 

* 19వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సులు కొట్టిన తిలక్ వర్మ.. జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో క్లిన్ బోల్డ్ అయిన తిలక్ వర్మ ( 21).. భారత్ స్కోర్ 237/6

* 18వ ఓవర్లో శివమ్ దూబే రనౌట్.. భారత్ స్కోర్ 217/5.. క్రీజులో హార్దిక్ పాండ్యా (14), తిలక్ వర్మ (3)

* 17 ఓవర్లో 3 బౌండరీలు కొట్టిన టీమిండియా.. క్రీజులో శివమ్ దూబే (37), హార్దిక్ పాండ్యా (13).. భారత్ స్కోర్: 212/4

* మరో వికెట్ కోల్పోయిన భారత్.. రషీద్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ స్టంప్ ఔట్.. 16 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 190/4

* 15 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 177/3.. ఈ ఓవర్లో 10 పరుగులు సాధించిన ఇండియా.. క్రీజులో శివమ్ దూబే (28), సూర్యకుమార్ యాదవ్ (5) 

* 14 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 167/3.. ఈ ఓవర్లో 15 పరుగులు రాబట్టిన టీమిండియా.. క్రీజులో శివమ్ దూబే (22), సూర్యకుమార్ యాదవ్ (4)

* సంజు శాంసన్ ఔట్.. 88 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్ లో పెవిలియన్ బాట పట్టిన సంజు.. భారత్ స్కోర్ 160/3 

* T20 వరల్డ్ కప్ నాకౌట్స్‌ మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్‌లో భారత్ తరపున అత్యధిక.. సంజు శాంసన్ వరుస సిక్సులతో కొట్టడంతో రికార్డు.. 

- 13 ఓవర్లో వరసగా రెండు సిక్సులు కొట్టిన సంజు శాంసన్.. భారత్ స్కోర్ 160/2

* 12వ ఓవర్ ముగిసే సమయానికి భారత్ స్కోర్ 145/2.. ఈ ఓవర్లో రెండు సిక్సులతో 17 పరుగులు రాబట్టిన శివమ్ దూబే.. క్రీజులో సంజు శాంసన్ ( 76), దూబే (17).. 

* రెండో వికెట్ కోల్పోయిన భారత్.. 97 పరుగుల భాగస్వామ్యం బ్రేక్.. ఆదిల్ రషీద్ బౌలింగ్ లో ఇషాన్ కిషన్ ఔట్

* 9ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 112/1.. సామ్‌ కర్రన్‌ బౌలింగ్ లో రెండు సిక్సులు, ఒక ఫోర్ తో మొత్తం 20 పరుగులు రాబట్టిన భారత్ 

* సంజు శాంసన్ బ్యాక్ టు బ్యాక్ అర్థ శతకాలు.. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంజు.. 8 ఓవర్లు ముగిసే సమయానికి భార్ స్కోర్ 92/1.. 

* ఏడో ఓవర్ వేసిన ఆదిల్ రషీద్.. ఈ ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే.. క్రీజులో సంజు శాంసన్ (46), ఇషాన్ కిషన్ (17)

* పవర్ ప్లే ముగిసే సమయానికి భారత్ స్కోర్ 67/1.. సామ్‌ కర్రన్‌ బౌలింగ్ లో వరుస రెండు బౌండరీలు కొట్టిన సంజు శాంసన్.. ఈ ఓవర్లో మొత్తం 12 పరుగులు పిండుకున్న భారత్

* ఐదో ఓవర్ వేసిన జేమీ ఓవర్టన్.. ఈ ఓవర్లో వరుస బాల్స్ లో రెండు ఫోర్లు కొట్టిన ఇషాన్ కిషన్.. భారత్ స్కోర్: 55/1 

* నాలుగు ఓవర్ వేసిన విల్ జాక్స్.. ఈ ఓవర్లో 11 రాబట్టిన భారత్.. క్రీజులో సంజు శాంసన్ (30), ఇషాన్ కిషన్ (6)

* మూడు ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోర్ 34/.. క్రీజులో సంజు శాంసన్ (25), ఇషాన్ కిషన్ (1)

* తొలి వికెట్ కోల్పోయిన భారత్.. రెండో ఓవర్లో విల్ జాక్స్ బౌలింగ్ లో అభిషేక్ క్యాచ్ ఔట్

* తొలి ఓవర్లోనే చెలగిరేన సంజు శాంసన్.. ఒక ఫోర్, ఒక సిక్సుతో 12 పరుగులు రాబట్టిన భారత్

* టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత జట్టు

* భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్

* ఒక్క మార్పుతో బరిలోకి దిగుతున్న ఇంగ్లాండ్ టీమ్

India vs  England: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ముంబైలోని వాంఖెడే స్టేడియంలో జరుగుతున్న కీలక సెమీఫైనల్ పోరులో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. దీంతో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన టీమ్ నేరుగా ఫైనల్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరింత సమాచారం కోసం చూస్తునే ఉండండి.. V6 తెలుగు ఛానల్ నీ..