వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిగిలో 1వ వార్డు అభ్యర్థి అక్కమ్మ కనిపించకుండా పోవడంతో ఆందోళనకు దిగారు గ్రామస్థులు. డీఎస్పీ ఆఫీసు ముందు బైఠాయించి నిరసనకు దిగారు నస్కల్ గ్రామస్థులు. అక్కమ్మను వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.తన భార్య అక్కమ్మ కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు భర్త నాగయ్య. అంతకు ముందు రోజే తన తల్లి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు అక్కమ్మ కొడుకు బాలరాజు.
తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేందటూ గ్రామస్థులతో కలిసి డిఎస్పీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు అక్కమ్మ భర్త నాగయ్య, కొడుకు బాలరాజు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అవ్వగానే తన భార్యను కొందరు బీఆర్ఎస్ నాయకులు ఎత్తుకెళ్ళారని ఆరోపిస్తున్నారు నాగయ్య. అక్కమ్మ కుటుంబసభ్యులు, గ్రామస్థుల ఆందోళనతో డీఎస్పీ ఆఫీసు దగ్గర ఉద్రిక్తత నెలకొంది.
