IND vs ENG: ఇంగ్లాండ్ పర్యటనలో వరుస ఓటములతో సతమతమవుతున్న భారత్ పై ఇంగ్లీష్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ గడ్డపై అంతర్జాతీయ క్రికెట్ ఆడటం ఐపీఎల్‌లో ఆడినంత ఈజీ కాదంటూ ఇండియన్ బ్యాటర్లకు చురకలు అంటించాడు. ఇక్కడి కండిషన్స్, పిచ్‌లు పూర్తి డిఫరెంట్ గా ఉంటాయి, కేవలం క్రమశిక్షణతో కూడిన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తేనే వికెట్లు దొరుకుతాయని క్లాస్ పీకాడు. మూడో టీ20లో ఇంగ్లాండ్ గెలుపులో కీ -రోల్ పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆర్చర్.. మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాలను దారుణంగా ఎండగట్టాడు.
ఇక్కడ 200 రన్స్ చేయడం అంత ఈజీ కాదు:
ఐపీఎల్ ఆడే ఫ్లాట్ వికెట్లకు, ఇంగ్లాండ్‌లోని పిచ్‌లకు చాలా తేడా ఉంటుందని జోఫ్రా ఆర్చర్ చెప్పుకొచ్చాడు. భారత్‌లో జరిగే మ్యాచ్‌లలో చిన్న బౌండరీలు, బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లు ఉండటంతో బౌలర్లకు పరిస్థితులు చాలా కఠినంగా ఉంటాయన్నాడు. అక్కడ 200+ రన్స్ చేసినా కూడా ఈజీగా చేజ్ అయిపోతాయి, కానీ ఇంగ్లాండ్ పిచ్‌లపై 200 పరుగులు చేయడం అంత ఆషామాషీ కాదన్నాడు. ఇక్కడి స్టేడియాల్లో బంతి వికెట్లపైకి ఎక్స్ట్రా బౌన్స్‌తో వస్తుంది, బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడితే ఇలాంటి ఘోర ఓటములే ఎదురవుతాయని వార్నింగ్ ఇచ్చాడు.
వైభవ్కి ఆర్చర్ ఓపెన్ ఛాలెంజ్:
భారత్ పై విమర్శలు చేయడంతో పాటు టీమిండియా వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీకి జోఫ్రా ఆర్చర్ ఓపెన్ ఛాలెంజ్ విసరడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ సిరీస్‌లో ఆర్చర్ బౌలింగ్‌లో వైభవ్ కొన్ని అద్భుతమైన సిక్సర్లు కొట్టిన విషయాన్ని గుర్తు చేయగా ఆర్చర్ నవ్వుతూ.. వైభవ్ నా బౌలింగ్‌లో సిక్సర్లు కొట్టిన మాట వాస్తవమే.. కానీ రాబోయే మ్యాచ్‌ల్లో అతడిని ఎలా కట్టడి చేయాలో, ఎలా ఔట్ చేయాలనే దానిపై నేను ఇప్పటికే ఒక పక్కా ప్లాన్ (Secret Plan) రెడీ చేసుకున్నాను అని వెల్లడించాడు. రాబోయే మ్యాచ్‌ల్లో వైభవ్‌కు ఇదే నా ఛాలెంజ్.. ఏం జరగబోతుందో చూద్దమని సవాల్ విసిరాడు.
76 పరుగులకే కుప్పకూలిన భారత్:
నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఇంగ్లాండ్ 125 పరుగుల భారీ తేడాతో భారత జట్టుని చిత్తుగా ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లీస్ టీమ్.. ఫిల్ సాల్ట్ (70 రన్స్), సామ్ కరన్ (44 నాటౌట్) రాణించడంతో 201 పరుగులు చేసింది. ఆ తర్వాత 202 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇండియా.. ఇంగ్లాండ్ పేసర్లు జోష్ టంగ్ (4 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (3 వికెట్లు) ధాటికి కేవలం 11.4 ఓవర్లలోనే 76 పరుగులకే ఘోరంగా ఓడిపోయింది.
బ్రిస్టల్‌లో భారత్ గెలవాల్సిందే:
ఈ గెలుపుతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 2–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ విజేత ఎవరో తేల్చే అత్యంత కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ ఈరోజు (గురువారం) రాత్రి భారత కాలమానం ప్రకారం 10:00 గంటలకు బ్రిస్టల్ వేదికగా స్టార్ట్ కానుంది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాగైనా గెలవాల్సిందే.
🔴 JOFRA ARCHER TROLLS IPL FLAT PITCHES AFTER INDIA STRUGGLES 🤯
— Sam (@cricsam02) July 8, 2026
🎙️: India's batters have to adjust because cricket in England is very different from the IPL.
- He explained that IPL pitches are flatter & the boundaries are smaller, making batting easier.
- In England, he… pic.twitter.com/CcbijjP5fQ
