Vijay: 'జన నాయగన్' రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. థియేటర్లలో జాతరకు సిద్ధమైన సీఎం సార్ ఫ్యాన్స్!

Vijay: 'జన నాయగన్' రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. థియేటర్లలో జాతరకు సిద్ధమైన సీఎం సార్ ఫ్యాన్స్!

దళపతి విజయ్ ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడనుంది. గత కొన్ని నెలలుగా ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న 'జన నాయగన్' మూవీ విడుదలకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి ఎంట్రీకి ముందు విజయ్ నటించిన లాస్ట్ అండ్ ఫైనల్ చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  సెన్సార్ వివాదంతో పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశఉంది. లేటెస్ట్ గా కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యార్క్ సినిమాస్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కెనడా డిస్ట్రిబ్యూటర్ హింట్..

నిజానికి ఈ సినిమా 2026 జనవరిలోనే థియేటర్లలోకి రావాల్సింది. కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కెనడాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ‘యార్క్ సినిమాస్’ (York Cinemas) సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించింది.

ఎట్టకేలకు మన దళపతి విజయ్ 'జన నాయగన్' సినిమాతో వెండితెరపై నిప్పులు చెరిగేందుకు సిద్ధమయ్యారు. జులై 24 నుంచి కెనడాలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం అంటూ ఒక క్రేజీ పోస్టర్‌ను పంచుకుంది. త్వరలోనే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అవుతాయని తెలపడంతో.. జులై 24న థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని తేలిపోయింది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇండియాలో ఒక రోజు ముందుగానే, అంటే జులై 23నే దళపతి జాతర మొదలయ్యే ఛాన్స్ ఉంది.

 

సెన్సార్ క్లియర్.. 

సెన్సార్ బోర్డు (CBFC) సూచించిన మార్పులన్నింటికీ చిత్ర యూనిట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. శుక్రవారం( జూలై 10 , 2026 ) కల్లా సెన్సార్ సర్టిఫికెట్ చేతికి వచ్చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఆల్రెడీ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లందరినీ జులై 24 రిలీజ్‌కు సిద్ధంగా ఉండాలని మేకర్స్ హింట్ ఇచ్చారట. ఈ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే, నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అధికారికంగా డేట్‌ను అనౌన్స్ చేయనుంది.

స్టార్ కాస్ట్‌తో నెక్స్ట్‌ లెవెల్ హైప్!

హెచ్. వినోద్ అద్భుతమైన కమర్షియల్ విజువల్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తుండగా.. విలన్‌గా బాలీవుడ్ లార్డ్ బాబీ డియోల్ పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. వీరితో పాటు ప్రకాష్ రాజ్, మమితా బైజూ కీలక పాత్రల్లో మెరవనున్నారు. ముఖ్యమంత్రి గా  బాధ్యతలు తీసుకోకముందు విజయ్ నటించిన చివరి సినిమా కావడంతో.. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ 'జన నాయగన్' ఎలాంటి సునామీ సృష్టిస్తాడో చూడాలి.