IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ను ఉతికి ఆరేసిన భారత్.. ఎంత స్కోర్ చేసిందంటే..?

IND vs PAK: పాకిస్థాన్ బౌలింగ్ను ఉతికి ఆరేసిన భారత్.. ఎంత స్కోర్ చేసిందంటే..?

IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్– పాకిస్థాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్‌ జరుగుతుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది.  బ్యాటింగ్ కి దిగిన భారత్ కి మొదటి ఓవర్లోనే బిగ్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ 4 బాల్స్ ఆడి జీరో పరుగులకే సల్మాన్ ఆఘా బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. అభిషేక్ అవుట్ అయినా తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ పాకిస్థాన్ బౌలర్లను ఊతికి ఆరేశాడు. కేవలం 27 బంతుల్లోనే ఇషాన్ (77) హాఫ్ సెంచరీ చేసిన తర్వాత సైమ్ అయూబ్ బౌలింగ్ లో క్లిన్ బౌల్డ్ అయ్యాడు. 


15వ ఓవర్ వేసిన సైమ్ అయూబ్ బౌలింగ్ లో తిలక్ వర్మ (25), హార్థిక్ పాండ్యా (0) వరుస బాల్స్ లో ఔట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే– టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తారీక్ బౌలింగ్ లో భారీ షాట్ ఆడబోయిన సూర్య (32) సైమ్ అయూబ్ కి క్యాచ్  ఇచ్చి పెవిలియన్ కి వెళ్లాడు. టీమిండియా బ్యాటర్లను పాక్ స్పిన్నర్లు కాస్త ఇబ్బంది పెట్టినప్పటికీ.. రెండు భారీ షాట్లతో దూబే చెలరేగిపోయాడు.

చివరి ఓవర్ వేసిన పాకిస్థాన్ పేసర్ షాహీన్ అఫ్రిది బౌలింగ్ లో దూబే ఒక ఫోర్ కొట్టి, సింగిల్ తీసి ఇవ్వగా, స్ట్రైక్ లోకి వచ్చిన రింకూ సింగ్ 3 బాల్స్ ఆడి ఒక ఫోర్, సిక్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో దూబే రన్ అవుట్ కాగా, అక్షర్ పటేల్ భారీ షాట్ ఆడబోయి ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి డగౌట్ కి వెళ్లాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ 3 వికెట్లు తీసుకోగా.. సల్మాన్ ఆఘా, ఉస్మాన్ తారిక్, షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీసుకున్నారు.