హైదరాబాద్, వెలుగు: భారతీ ఎయిర్‌టెల్ బిజినెస్ విభాగం, ప్రభుత్వ రంగ సంస్థ ఐటీఐ.. కార్పొరేట్ సంస్థలకు డిజిటల్ పరిష్కారాలు అందించేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందంతో రక్షణ రంగం, ఇతర ప్రభుత్వ రంగాలలో ఎయిర్‌టెల్ తన సేవలను విస్తరిస్తుంది. ప్రభుత్వ, బ్యాంకింగ్ విభాగాలకు కావలసిన సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ సేవలు, ఐఓటీ పరిష్కారాలను సంయుక్తంగా అందిస్తారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఇవి పనిచేస్తాయి. రక్షణ రంగానికి అవసరమైన నెట్‌వర్క్ కోసం ఐటీఐ రూ.7,796 కోట్ల ప్రాజెక్టును దక్కించుకుంది.
