మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ లోని మణికొండలో ఉన్న రోహిత్ రెడ్డి నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. తాండూర్, వికారాబాద్ ప్రాంతాల నుంచి సుమారు 50 మంది పోలీసులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి అనుచరులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వీడియోలు తీస్తున్న రోహిత్ రెడ్డి కుటుంబసభ్యుల ఫోన్లను లాక్కున్నారు పోలీసులు.
ఈ క్రమంలో రోహిత్ రెడ్డి ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టకుండా.. ప్రశ్నించిన బీఆర్ఎస్ నేతలపై కేసు పెడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.
