పాక్ను ఇలా ఓడించాం.. 8-1 అని రాస్కోండి.. ఎలా దెబ్బ కొట్టామో ఈ వీడియోలో చూసేయండి !

పాక్ను ఇలా ఓడించాం.. 8-1 అని రాస్కోండి.. ఎలా దెబ్బ కొట్టామో ఈ వీడియోలో చూసేయండి !

పాకిస్తాన్పై టీమిండియా గెలిచింది. అలాంటి.. ఇలాంటి గెలుపు కాదు. ఈ మ్యా్చ్ ఎప్పుడు గుర్తొచ్చినా టీమిండియా అభిమానులు గర్వపడే గెలుపు. పాకిస్తాన్కు చాన్నాళ్లూ గుర్తుండిపోయే ఓటమి.. స్పిన్ బౌలింగ్తో టీమిండియాను కట్టడి చేశామని పాక్ భావించింది. కానీ.. అంతకు మించిన బౌలర్లు మన దగ్గర ఉన్నారనే విషయాన్ని మర్చిపోయింది.

ఫలితంగా.. భారీ ఓటమిని పాకిస్తాన్ చవిచూసింది. ఈ మ్యాచ్ బాయ్కాట్ చేసినా బాగుండేదని పాక్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా తమ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారంటే టీమిండియా ఎంతటి కోలుకోలేని దెబ్బ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఉద్విగ్న క్షణాలను ఈ వీడియోలో మీరూ చూడండి.. టీమిండియా గెలుపునకు సంబంధించిన మధుర అనుభూతులను ఆస్వాదించండి.

పాక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే ఆలౌట్ అయి చేతులెత్తేసింది. టీమిండియా బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు ఏ దశలోనూ నిలవలేకపోయారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇషాన్ కిషన్కు దక్కింది.