రూ. 100, రూ. 500 నోట్లపై వస్తున్న పుకార్లకు ఆర్బీఐ ఫుల్ స్టాప్ పెట్టింది. రూ.100,రూ.500 నోట్లలో మార్పులు తెస్తు్న్న ఆర్బీఐ పాత నోట్లను రద్దు చేయడం లేదని ప్రకటించింది. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. ఎప్పటిలాగే పాత నోట్లు చెల్లుబాటు అవుతాయని తెలిపింది.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు ఎక్కువగా ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ,చిరు వ్యాపారులకు నగదు చాలా ముఖ్యం. కరెన్సీలో రూ.100,రూ.500 నోట్లు ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. మార్కెట్లో ఉన్న ఈ కరెన్సీ నోట్లు చాలా కాలంగా చెలామణిలో ఉండటంతో కొన్ని చినిగిపోవడం, రంగు పోవడం, ఫీచర్లు సరిగా కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే నకిలీ నోట్లు చెలామణిలో ఉన్నాయి. ఈ క్రమంలో రూ. 100 నోట్లలో కొన్ని మార్పులు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. పాత డిజైన్ లోనే ప్రింట్ లో నాణ్యత, ఇంకు ఎక్కువ కాలం ఉండటం, సెక్యూరిటీ థ్రెడ్ ను మరింత క్వాలిటీతో తేనున్నారు. కొత్త మార్పులతో నోట్లు అసలైనవా? నకిలీవా అని తెలుసుకోవడం ఈజీ అవుతుంది.
రూ. 500 నోట్లలో స్వల్పంగా డిజైన్ లో స్వల్ప మార్పులు చేయనున్నారు. అంటే కలర్ మరింత స్పష్టంగా కనిపించేలా, మైక్రో ప్రింటింగ్ చేయనున్నారు. పాత,కొత్త నోట్లు ఏటీఎంలు,బ్యాంకులలో ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేస్తాయి. ప్రజాసంక్షేమం , కరెన్సీ భద్రత కోసమే ఈ మార్పులు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది.
