జ్యోతిష్యం : జులై నెల .. ధనస్సు రాశి వారి జాతకం.. జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు..

 జ్యోతిష్యం  :  జులై నెల .. ధనస్సు రాశి వారి  జాతకం.. జీవితంలో అత్యంత కీలకమైన మార్పులు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 జులై నెల అత్యంత కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది. ఈ నెలలో ధనస్సు రాశి వారి జీవితంలో  సరికొత్త సమీకరణాలకు తెరలేపే అవకాశాలున్నాయి. గ్రహాల సంచారం ఆధారంగా ఈ నెలలో  ధనస్సురాశి వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .! 

జూలై  నెల ధనుస్సు రాశి వారి జీవితంలో ఆకస్మికంగా మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంది.  ఆరవ స్థానంలో (శత్రు, రోగ స్థానం) సంచరిస్తున్న కుజుడు  ఒక సైన్యాధ్యక్షుడిలా అండగా ఉంటాడు. ఆఫీసులో గానీ, బయట గానీ మీ పట్ల కుట్రలు చేసే వారి ఆటలు ఈ నెలలో సాగవు. అప్పుల బాధల నుంచి బయటపడటానికి ఒక స్పష్టమైన మార్గం దొరుకుతుంది.  అష్టమ స్థానంలో (8వ ఇల్లు) సంచరిస్తున్న  గురువు జీవితంలో కొన్ని ఆకస్మిక మలుపులు ఇస్తాడు. మంచి అయినా, చెడు అయినా అకస్మాత్తుగా జరుగుతాయి, కానీ గురువు ఉచ్ఛ స్థితిలో ఉండటం వల్ల మీకు ఎటువంటి నష్టం వాటిల్లదు. మరోవైపు, భాగ్య స్థానంలో (9వ ఇల్లు) కేతువు వల్ల మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు కానీ, నిజ జీవితంలో మాత్రం ఒక రకమైన ఆత్మన్యూనతా భావం, తండ్రి పట్ల లేదా గురువుల పట్ల నిర్లిప్తత కలిగి ఉంటారు. 4వ ఇంట అర్ధాష్టమ శని వల్ల గృహంలో సర్దుకుపోవడం నేర్చుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది.

రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితిలో ఉండడం, సప్తమ స్థానంలో రవి సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు సునాయాసంగా పూర్తవుతాయి. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. మాటకు, చేతకు విలువ ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం కొనసాగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నం అయినా అనుకూల ఫలి తాలనిస్తుంది. 

వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది పెడతాయి. ఎవరికీ వాగ్దానాలు చేయడం గానీ, హామీలు ఉండడం గానీ చేయవద్దు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద మరింతగా శ్రద్ధ పెట్టాలి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. పిల్లలు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.

 చేయాల్సిన పరిహారాలు:

 గురు అనుగ్రహం: 8వ ఇంట ఉన్న గురువు వల్ల కలిగే ఆకస్మిక లాభాలు నిలకడగా ఉండటానికి గురువారం నాడు శనగలు దానం చేయండి ...  గురు దత్తాత్రేయ స్తోత్రం 11 సార్లు  చదువుకోండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.