తమిళనాడు సీఎం ,దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం 'జననాయగన్' ( Jana Nayagan ) . భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా వివాదాలతో రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ సస్పెన్స్ కు ఇప్పుడు తెరపడేలా కనిపిస్తోంది. విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
వాయిదాకు కారణం ఇదే..?
పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమా 2026 సంక్రాంతి బరిలో నిలవాల్సింది. కానీ సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరాలు, కోర్టు కేసులు, మే నెలలో కొన్ని సీన్స్ లీక్ అవడం వంటి కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే లేటెస్ట్ గా సెన్సార్ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మూవీకి 'A' సర్టిఫికేట్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.
రిలీజ్ రేస్‌లో క్రేజీ డేట్స్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. జూలై 16, 2026న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ సెన్సార్ ఆలస్యమైతే.. ఆగస్టు 7, 2026న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేయాలంటే ప్రొడక్షన్ హౌస్ KVN ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించాల్సిందే.
మెగా కాస్టింగ్..
విజయ్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ లాస్ట్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా , బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ విలన్‌గా నటించారు. మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్ కీలక పాత్రలు పోషించారు.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిచారు. తమిళనాడు సీఎం దళపతి విజయ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించబోయే ఆఖరి చిత్రం కావడంతో, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.
