పురుగులు.. జంతువుల కళేబరాలతో నల్లా నీరు.. ఆందోళనలో కొత్తపల్లి గ్రామస్థులు

 పురుగులు.. జంతువుల కళేబరాలతో నల్లా నీరు.. ఆందోళనలో  కొత్తపల్లి గ్రామస్థులు

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి లో మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.కొత్తవల్లిలో ఇంటి నల్లాల నుంచి జంతువుల ఈకలు,  కళేబరాలు, పెద్ద పెద్ద పురుగులతో కూడిన నీళ్లు రావడంతో గ్రామస్థులుఆందోళనకు గురయ్యారు.  కలుషిత నీటిని తాగితే రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మంచి నీటి  కుళాయిల నుండి పురుగులు వస్తున్న విషయం  వైరల్ కావడంతో.. వెంటనే అప్రమత్తమైన పంచాయతీ సిబ్బంది మిషన్ భగీరథ ట్యాంకును క్లీన్ చేయించే ప్రక్రియను ప్రారంభించారు. ఇక ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు స్పందించి సంబధిత సిబ్బంది నీటి ట్యాంకులను క్రమం తప్పకుండా పర్యవేక్షించేలా చూడాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.