అద్దె కారు మొరాయించింది.. స్నేహితులు ముఖం చాటేశారు.. ఆ తరువాత బీటెక్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా..!

అద్దె కారు మొరాయించింది.. స్నేహితులు ముఖం చాటేశారు.. ఆ తరువాత బీటెక్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా..!
  • కారు యజమాని ఒత్తిడితో బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
  • హాస్టల్ బాత్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వైనం
  • రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో ఘటన

ఇబ్రహీంపట్నం, వెలుగు: అద్దెకు తీసుకున్న కారు మార్గమధ్యలో చెడిపోగా వెంటవచ్చిన స్నేహితులు సహకరించకపోవడం, కారు యజమాని ఒత్తిడి తట్టుకోలేక ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్​పల్లిలోని సాయి రామ్ బాయ్స్ హాస్టల్‌‌‌‌‌‌‌‌లో చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా గార్మిల్లకు చెందిన సుంకరి శ్రీనాథ్(21) ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతూ.. హాస్టల్‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. 

గత జూలై 16న కొండ్రు శంకరయ్య కారును అద్దెకు తీసుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులు ఉదయ్ సాయి రెడ్డి, సంజయ్ గౌడ్, ఆశిష్‌‌‌‌‌‌‌‌లతో కలిసి హైదరాబాద్​లో తిరిగి, 17న వైజాగ్ వెళ్లారు. అక్కడ ఆశిష్‌‌‌‌‌‌‌‌ పుట్టినరోజు వేడుకలు ముగించుకుని, 18న ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్తుండగా మధ్యలో కారు ఆగిపోయింది. 

దాన్ని కంటైనర్ వాహనంలో శ్రీనాథ్​హైదరాబాద్​తీసుకొచ్చాడు. రిపేర్​కోసం శ్రీనాథ్​రూ.4 వేలు ఖర్చు చేశాడు. అయినా కారు ఇంకా పూర్తిస్థాయిలో బాగు కాలేదు. జూలై 31న వాహనాన్ని ఓనర్​కు అప్పగించి, సొంతూరుకు వెళ్లిపోయాడు. తిరిగి ఈ నెల 11న రాత్రి హాస్టల్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. విషయం తెలుసుకుని కారు యజమాని శంకరయ్య మరికొందరితో కలిసి హాస్టల్ వద్దకు వచ్చాడు. 

కారు అద్దె రోజుకు రూ.4 వేల చొప్పున చెల్లించాల్సి ఉండటం, ఇంకా రిపేర్​చేయించాల్సి ఉండటం, స్నేహితులు ముఖం చాటేయడంతో శ్రీనాథ్​తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. గదిలో వాటర్ బాటిల్‌‌‌‌‌‌‌‌లో ఉన్న పెట్రోల్​ తీసుకొని బాత్‌‌‌‌‌‌‌‌రూమ్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. హాస్టల్ యజమాని శ్రీనాథ్​ను ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తరలించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్​ రెడ్డి 
పేర్కొన్నారు.