రంగారెడ్డి:హైదరాబాద్‌లోని పేట్-బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైటెక్ పేకాట రాయుళ్ల గుట్టును పోలీసులు రట్టు చేశారు.అపర్ణ సెరినిటీ అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా డబ్బులు పందెంగా పెట్టి టీన్ పత్తి ఆడుతున్న రాయుళ్లపై పోలీసులు మెరుపు దాడి చేశారు.ఈ దాడిలో మొత్తం 8 మందిని పట్టుకున్నారు.వాళ్ల దగ్గర నుంచి 3 లక్షల 28 వేల రూపాయల నగదు,8 మొబైల్ ఫోన్లు,10 సెట్ల పేకాట కార్డులతో పాటు నోట్లు లెక్కపెట్టే 1 క్యాష్ కౌంటింగ్ మెషిన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.వీరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
