ఆమనగల్లు, వెలుగు : ఆమనగల్లు మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రతి వార్డులో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణం చేపట్టడమే కాక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని వివరించారు. అనంతరం కపాస్ కాంతి పథకం కింద పత్తి రైతులకు సబ్సిడీపై పురుగుల మందులు పంపిణీ చేశారు. కార్యక్రమాలలో వైస్ చైర్మన్ గీత, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ రాఘవేందర్ రెడ్డి, ఏడీఏ శోభారాణి, ఏవో శ్రీనివాస్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.
