NKRAR2 Update: పటాస్ మ్యాజిక్‌ను మించే గ్లింప్స్ రెడీ?.. కళ్యాణ్ రామ్ బర్త్‌డేకు అనిల్ స్పెషల్ సర్‌ప్రైజ్!

NKRAR2 Update: పటాస్ మ్యాజిక్‌ను మించే గ్లింప్స్ రెడీ?.. కళ్యాణ్ రామ్ బర్త్‌డేకు అనిల్ స్పెషల్ సర్‌ప్రైజ్!

వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ క్రేజీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మల్టీస్టారర్ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అనంతరం జూన్ 22 నుంచి హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి త్వరలోనే ఓ క్రేజీ అప్‌డేట్ రానుందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

జూలై 5న కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్గా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ రానుందని సమాచారం. అయితే, సినీ వర్గాల సమాచారం ప్రకారం. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ‘పటాస్’తో కళ్యాణ్ రామ్‌లోని కామెడీ టైమింగ్‌ను బయటకు తీసిన అనిల్ రావిపూడి.. ఈసారి కూడా ఆయన పాత్రను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో కళ్యాణ్ రామ్ కు జోడిగా కృతిశెట్టి, వెంకీమామక జోడిగా కీర్తి సురేష్​ నటిస్తోంది. వరుస ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్తో వస్తున్న అనిల్ రావిపూడి.. ఈ సినిమాతో మరో గ్రాండ్ సక్సెస్ అందుకోనున్నారని ముందే అర్థమైపోతుంది.

ఇప్పటికీ రెండు క్రేజీ ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను అలర్ట్ చేశారు అనిల్. ఇదే క్రమంలోనూ ఈ సినిమా టైటిల్ బయటికొచ్చి మరింత ఆసక్తి క్రియేట్ చేస్తోంది. సంక్రాంతి సెంటిమెంట్‌ను నమ్ముకునే అనిల్.. ఈ చిత్రానికి ఏకంగా ‘జనవరి 13 విడుదల’ అనే వెరైటీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టైటిల్ వింటేనే అనిల్ మార్క్ కామెడీ అండ్ కమర్షియల్ వైబ్స్ క్లియర్‌గా అర్థమవుతున్నాయి. ఇక వెంకీ కామెడీ టైమింగ్, కల్యాణ్ రామ్ యాక్షన్, అనిల్ మార్క్ మ్యాజిక్‌ను ఆస్వాదించాలంటే వచ్చే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.