హైదరాబాద్, వెలుగు: లైఫ్‌స్టైల్ మెంబర్షిప్ చెయిన్ కంట్రీ క్లబ్‌లో ‘ఇండో–టర్కీ కల్చరల్, హాస్పిటాలిటీ’ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని టర్కీ దేశ కాన్సుల్ జనరల్ హెచ్.ఈ. మిస్టర్ ఓర్హాన్ యాల్మాన్ ఓకాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా టర్కీ సంస్కృతి, చేతిరాతల వైభవాన్ని చాటేలా "టర్క్ మోడా" ఫ్యాషన్ షో నిర్వహించారు.
కంట్రీ క్లబ్ ఛైర్మన్ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కొత్త వెంచర్ 'కంట్రీ వివాహ్' ద్వారా టర్కీలో డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు ఉన్న భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు.
