జ్యోతిష్యం : వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు..తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులే..!

జ్యోతిష్యం : వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు..తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులే..!

వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జూలై నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు  అంచనా వేస్తున్నారు. ఈ నెలలో ఇతరులతో మాట్లాడేవిషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశం ఉంది.  ఏ విషయంలో కూడా  ఎట్టి పరిస్థితిలో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. 

 వృశ్చిక రాశి వారికి  ఈ నెల ( జులై 2026)  మానసికంగా ఎన్నో పాఠాలు నేర్పుతుంది. భాగ్య స్థానంలో (9వ ఇల్లు) ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు  చల్లని చూపుల వల్ల మీకు రావలసిన అదృష్టం, ధనం అనుకున్న సమయానికి అందుతుంది. కానీ మానసికంగా చాలా ఇబ్బంది పడతారు.  కర్మ స్థానంలో (10వ ఇల్లు) కేతువు తిష్ట వేయడం వల్ల, మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నా మిమ్మల్ని కలవరపెడుతుంది.  7వ ఇంట ఉన్న కుజుడు మీలోని ఆవేశాన్ని పెంచి భాగస్వాములతో గొడవలు పడేలా చేస్తాడు. దైవబలం మీకు పూర్తిగా ఉంది కాబట్టి, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఈ గ్రహాల ప్రతికూలతల నుంచి సులభంగా గట్టెక్కుతారు.

ఈ రాశికి సప్తమ, భాగ్య స్థానాలు బాగా పటిష్ఠంగా ఉన్నందువల్ల ఆర్థిక, ఆస్తి వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. కుటుంబ, వ్యక్తిగత వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. . ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు రాకపోవచ్చు. 

 ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు . దాంపత్య జీవితం సజావుగా సాగిపో తుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది.

 ఈ రాశి వారు ఈ నెలలో  ఇతరులతో చాలా జాగ్రత్తగా, మర్యాదపూర్వకంగా మాట్లాడండి. తెలివితేటలు, మంచి విచక్షణ చివరికి ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడతాయి. ఈ సమయంలో మీ సహచరులు, సహోద్యోగులు కూడా మీకు మద్దతును అందిస్తారు. నెల రెండో వారంలో మీరు గతంలో చేసిన కృషికి, కష్టానికి సానుకూల ప్రతిఫలాలను పొందవచ్చు. నెల మధ్యలో వృత్తి లేదా వ్యాపార ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు ఆహ్లాదకరంగా, లాభదాయకంగా ఉంటాయి.. దాంపత్య జీవితం సజావుగా సాగిపో తుంది. చిన్ననాటి స్నేహితులతో విందులో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లలు మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి.

చేయాల్సిన పరిహారాలు 

 కుజ దోష శాంతి: భాగస్వామితో వివాదాలు మరియు ఆవేశం తగ్గడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి లేదా ఆంజనేయ స్వామికి ఎర్రని పూలతో పూజ చేయండి. కందిపప్పు దానం చేయండి.

 కేతు పరిహారం: వృత్తిలో నిర్లిప్తత, ఆత్మన్యూనతా భావం తొలగిపోయి ధైర్యం కలగడానికి ప్రతిరోజూ గణపతి అథర్వశీర్షం పఠించండి.

 గురు అనుగ్రహం: భాగ్య స్థానంలో ఉన్న ఉచ్ఛ గురువు యొక్క పూర్తి అదృష్టాన్ని పొందడానికి గురువారం నాడు సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించుకోండి.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.