బంగారం,వెండి ధరలకు మళ్ళీ రెక్కలు.. 10 గ్రాముల ధర ఎంత పెరిగిందంటే ?

బంగారం,వెండి ధరలకు మళ్ళీ రెక్కలు..  10 గ్రాముల ధర  ఎంత పెరిగిందంటే ?

ప్రపంచ మార్కెట్‌లో సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ, ఈరోజు (జూలై 2) భారతదేశంలో బంగారం, వెండి ధరల్లో ఒడుదొడుకులు కనిపించాయి. అంతర్జాతీయ (Spot) మార్కెట్‌లో బంగారం ధర 1% పెరిగి ఔన్సుకు $4,065 పైకి చేరింది. వెండి ధర 2% పెరిగి ఔన్సుకు $60 దాటింది.

 మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు 1% నుండి 2% వరకు తగ్గాయి. యూఎస్ డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ బ్యారెల్‌కు $68 కంటే తక్కువకు పడిపోయింది.బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $71 కంటే తక్కువగా ట్రేడ్ అవుతోంది.

ఈ రోజు (2 జూలై 2026) గురువారం బంగారం ధర 24 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.377  పెరిగి రూ.14,455,  22క్యారెట్ల బంగారం 1  గ్రాము ధర రూ.345 పెరిగి రూ.13,250, 18క్యారెట్ల  బంగారం 1 గ్రాము ధర రూ.282 పెరిగి రూ.10,841 చేరింది.  

10 గ్రాముల 24 క్యారెట్ల ధర రూ.3,770 పెరిగి  రూ.1,44,550, 22 క్యారెట్ల  ధర రూ.3,450 పెరిగి రూ.1,32,500, 18 క్యారెట్ల ధర రూ.2,820 పెరిగి  రూ.1,08,410. 

వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లో 10 గ్రాముల  24 క్యారెట్ల ధర  రూ.1,44,550,  22క్యారెట్ల  ధర రూ.1,32,500, 18 క్యారెట్ల  ధర రూ.1,08,410.

విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురంలో  10 గ్రాముల  24 క్యారెట్ల ధర  రూ.1,44,550,  22క్యారెట్ల  ధర రూ.1,32,500, 18 క్యారెట్ల  ధర రూ.1,08,410.

వెండి  1 గ్రాము  ధర రూ.5 పెరిగి రూ.245 చేరగా...  కిలోకి 5 వేలు పెరిగి రూ.2,45,000  చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి కిలో ధర రూ.2,50,000 చేరింది. 

ధరలు మళ్లీ పెరగడానికి కారణాలు ఏంటి?
ఇటీవల డాలర్ బాగా బలపడటంతో (101.4 మార్కును దాటడంతో) అంతర్జాతీయంగా బంగారం 8 నెలల కనిష్ట స్థాయికి, వెండి 7 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ ధరలు పుంజుకోవడానికి ముఖ్య కారణాలు ఇవే:

*అమెరికాలో ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) అంచనాలు తగ్గాయని, కాబట్టి వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ప్రస్తుతానికి లేదని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ తెలిపారు.

*బుధవారం వచ్చిన డేటా ప్రకారం, అమెరికా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల నియామకాలు అనుకున్నదానికంటే తగ్గాయి.

* హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పెరగడం, అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం కూడా చమురు ధరలు తగ్గడానికి, బంగారానికి మద్దతుగా నిలవడానికి కారణమయ్యాయి.

నిపుణుల అంచనా 
ప్రస్తుతం మార్కెట్ వర్గాలు అమెరికాకు చెందిన కీలక ఆర్థిక నివేదికల (ఉపాధి మార్పులు, నిరుద్యోగిత రేటు) కోసం ఎదురుచూస్తున్నాయి. వీటి ఆధారంగానే సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.