కుంభ రాశిలో జన్మించిన వారికి జూలై నెల సగటు ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారి ప్రణాళిక వేసుకున్న పనులను పూర్తి చేయడానికి అదనపు కృషి, శ్రమ చేయవలసి ఉంటుంది. చిన్న పనులకు కూడా చాలా పరుగులు పెట్టవలసి రావచ్చని పండితులు చెబుతున్నారు.
జులై నెలలో ఈ రాశి వారికి కుజుడు,సూర్యుడు ఈ నెల 7 తర్వాత బుధుడు బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగ సంబంధ మైన ఏ ప్రయత్నమైనా ఘన విజయం సాధిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవకాశంఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.
కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది. కొద్దిగా చికాకు కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు మీ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయవచ్చు, అదే సమయంలో మీ ఆదాయ వనరులలో అంతరాయాలు మానసిక క్షోభకు కారణం కావచ్చు. నెల ప్రారంభంలో గృహ సమస్యలు ప్రబలంగా ఉంటాయి. మీరు ఇంటి మరమ్మతుల కోసం లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయవలసి రావచ్చు. ఈ కాలంలో మీరు నిరంతర శారీరక, మానసిక అలసటను అనుభవించవచ్చు.
వ్యక్తిగత ఉన్నతికి, యత్న కార్యసిద్ధికి అవకాశం ఉంది. వృత్తి జీవితం చాలావరకు సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా అవ కాశాలు అంది వస్తాయి. అనుకోకుండా పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పిల్లలు చదువుల్లో కొద్దిగా వెనుకబడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్తంత నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.
చేయాల్సిన పరిహారాలు
- ప్రతిరోజూ వినాయకుడికి గరికతో పూజ చేయండి.
- పెరుగన్నం నైవేద్యం పెట్టండి.
- ఇంట్లో అనవసర గొడవలు .. ఆవేశం తగ్గడానికి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి కుజ గాయత్రీ మంత్రం పఠించండి.
- ఏలినాటి శని చివరి దశలో ఆర్థిక నష్టాలు లేదా మాట పట్టింపులు రాకుండా శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
