DMHO ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైన చాలు.. కొద్దిరోజులే ఛాన్స్

DMHO  ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. టెన్త్, ఇంటర్ పాసైన చాలు.. కొద్దిరోజులే ఛాన్స్

జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ (DMHO) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల  భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: ల్యాబ్ టెక్నీషియన్.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ (10 + 2)తోపాటు సంబంధిత రంగంలో డిప్లొమా లేదా మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో సర్టిఫికెట్ కోర్సు పూర్తిచేసి ఉండాలి. బీఎస్సీ (ఎంఎల్​టీ)/ ఎంఎస్సీ (ఎంఎల్​టీ) పూర్తిచేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఎన్​టీఈపీ లేదా స్పుటం స్మియర్ మైక్రోస్కోపీలో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

వయోపరిమితి: 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో ఉండాలి. 

అప్లికేషన్: ఆఫ్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: జులై 1.

లాస్ట్ డేట్: జులై 8. 

సెలెక్షన్ ప్రాసెస్: మెరిట్, క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్, వయోపరిమితి ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. క్వాలిఫయింగ్ ఎగ్జామ్​కు 90 మార్కులు, వయోపరిమితికి 10 మార్కుల వెయిటేజీ ఉంటుంది.