ఎంత పని చేశావ్ అభిషేక్.. ఒక్క రన్ అయినా చేయాల్సింది.. ఈ చెత్త రికార్డ్ తప్పేది !

ఎంత పని చేశావ్ అభిషేక్.. ఒక్క రన్ అయినా చేయాల్సింది.. ఈ చెత్త రికార్డ్ తప్పేది !

పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయం సాధించింది. కానీ.. అభిషేక్ బ్యాటింగ్ అభిమానులు పూర్తి నిరాశపరిచింది. పాక్పై చెలరేగి దాయాది జట్టు కెప్టెన్కు బ్యాటింగ్తో సమాధానం చెబుతాడనుకుంటే అతని బౌలింగ్లోనే ఔట్ అయి.. అది కూడా డకౌట్ అయి అభిమానులను హర్ట్ చేశాడు.

అభిషేక్ శర్మపై టీమిండియా అభిమానులు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి. అభిషేక్ శర్మ ఆడాలని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా చేసిన వ్యాఖ్యలు.. అదే సల్మాన్ అఘా బౌలింగ్లో అభిషేక్ డకౌట్గా వెనుదిరగడంతో ఈ టీమిండియా ఓపెనర్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అభిషేక్ శర్మ బీభత్సమైన ఇన్నింగ్స్ ఆడి పాక్కు చుక్కలు చూపిస్తాడని భావిస్తే ఇలా జీరోగా వెనుదిరగడాన్ని టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ టీ20 వరల్డ్ కప్లో USAతో ఆడిన ఓపెనింగ్ మ్యాచ్లో కూడా అభిషేక్ డకౌట్ అయి పెవిలియన్ చేరాడు. పాక్ మ్యాచ్లోనూ అదే జరిగింది. అభిషేక్ ఆడిన గత ఆరు ఇన్నింగ్స్లో ఇది నాలుగో డకౌట్ కావడం గమనార్హం. అంతేకాదు.. టీ20 వరల్డ్ కప్స్లో 3 సార్లు డకౌట్ అయిన చెత్త రికార్డ్ ఆశిష్ నెహ్రా పేరు మీద ఉండగా.. రెండు సార్లు డకౌట్ అయిన రికార్డ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, శివమ్ దూబే పేరు మీద ఉంది. ఇప్పుడు అభిషేక్ శర్మ కూడా ఈ చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వచ్చింది.

గత ఆరు టీ20 మ్యాచుల్లో అభిషేక్ స్కోర్స్ ఒక్కసారి గమనిస్తే.. 0 (4), 0 (1), 30 (16), 0 (1), 68* (20), 0 (1). ఒక్క మ్యాచ్లో మాత్రమే అభిషేక్ తన సత్తా చూపించాడు. ఒక మ్యాచులో 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన నాలుగు మ్యాచుల్లో మాత్రం డకౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.