కుషాయిగూడ/మల్కాజిగిరి, వెలుగు: రాపిడో ఆటోలో ప్రయాణించిన ఓ మహిళ ఆభరణాల బ్యాగ్‌ను మర్చిపోయారు. కుషాయిగూడ పోలీసులు ఆ బ్యాగ్‌ను రికవరీ చేసి, ఆమెకు తిరిగి అప్పగించారు. ఇంద్రానగర్‌కు చెందిన ఓ మహిళ గురువారం కీసరలోని ఫంక్షన్‌కు వెళ్లేందుకు రాపిడో ఆటోలో ప్రయాణించి, తన బ్యాగ్‌ను అందులోనే మర్చిపోయారు. బ్యాగ్‌లో 2 తులాల బంగారు ఉంగరాలు, 10 తులాల వెండి పట్టీలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు చేయడంతో కుషాయిగూడ క్రైం ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు ఆ ఆటోను ట్రేస్ చేశారు. డ్రైవర్‌ను విచారించి బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు. పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
