యుద్ధ ట్యాంకుల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు : రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్

యుద్ధ ట్యాంకుల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు : రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్

జబల్పూర్ (మధ్యప్రదేశ్): యుద్ధ రంగంలో డ్రోన్లు, క్షిపణుల పాత్ర ఎంత పెరుగుతున్నప్పటికీ, యుద్ధ ట్యాంకుల ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదని రక్షణ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శత్రువుకు ఇవి "ఉక్కు గోడ"లా నిలిచి, సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని కొనియాడారు. గురువారం మధ్యప్రదేశ్‌‌లోని జబల్‌‌పూర్‌‌లో ఉన్న 57 ఏండ్ల చరిత్ర కలిగిన వెహికల్ ఫ్యాక్టరీ జబల్‌‌పూర్ (వీఎఫ్ జే)లో రూ.472 కోట్ల వ్యయంతో నిర్మించనున్న టీ-సిరీస్ యుద్ధ ట్యాంకుల ఓవర్‌‌హాల్ కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాజ్​నాథ్​సింగ్ మాట్లాడారు. మన సైన్యం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బలగాల్లో ఒకటిగా ఉందని, టీ-72, టీ-90 యుద్ధ ట్యాంకులు గ్రౌండ్ వార్‌‌ఫేర్‌‌కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ నూతన కేంద్రం ద్వారా ఏటా 80 టీ-72, టీ-90 ట్యాంకులను ఓవర్‌‌హాల్ చేయనున్నట్లు తెలిపారు. భారత సైన్యానికి ఏటా సుమారు 230 ట్యాంకుల పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.