అగ్రి బీఎస్సీ కోర్సుల కౌన్సెలింగ్‌‌‌‌ ప్రారంభం..తొలి రోజు 213 సీట్ల భర్తీ

అగ్రి బీఎస్సీ కోర్సుల కౌన్సెలింగ్‌‌‌‌ ప్రారంభం..తొలి రోజు 213 సీట్ల భర్తీ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రొఫెసర్‌‌‌‌ జయశంకర్‌‌‌‌ అగ్రికల్చర్​ వర్సిటీ పరిధిలోని కాలేజీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్‌‌‌‌) అగ్రికల్చర్‌‌‌‌, బీటెక్‌‌‌‌ (ఫుడ్‌‌‌‌ టెక్నాలజీ) రెగ్యులర్‌‌‌‌ సీట్ల భర్తీకి గురువారం కౌన్సెలింగ్‌‌‌‌ ప్రారంభమైంది. 

రాజేంద్రనగర్‌‌‌‌లోని వర్సిటీ ఆడిటోరియంలో ఈ నెల 29 వరకు తొలి విడత కౌన్సెలింగ్‌‌‌‌ కొనసాగనుంది. తొలి రోజు వివిధ కాలేజీల్లో మొత్తం 213 సీట్లు భర్తీ అయ్యాయి. ఇన్‌‌‌‌చార్జి రిజిస్ట్రార్‌‌‌‌, డీన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ అఫైర్స్‌‌‌‌ సీహెచ్‌‌‌‌ వేణుగోపాల్‌‌‌‌రెడ్డి, డీన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌ కె ఝాన్సీరాణి కౌన్సెలింగ్‌‌‌‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కంట్రోలర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎగ్జామినేషన్స్‌‌‌‌ ఎం.మల్లారెడ్డితోపాటు బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.