- ఇప్పపల్లిలో 500 మెట్రిక్ టన్నుల గోదాంను ప్రారంభించిన విప్ ఆది శ్రీనివాస్
కోరుట్ల, వెలుగు: రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్అన్నారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ సంఘం లిమిటెడ్ భూషణ్ రావుపేట ఆధ్వర్యంలో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంను గురువారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సహకార సంఘాల ఆధ్వర్యంలో అనేక గ్రామాల్లో రైతులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు కొత్త రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతుల సంక్షేమం కోసం సుమారు రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇప్పపల్లి తండా–కలికోట, కలికోట–పోతారం, భూషణ్‌రావుపేట–రాజారాం తండా మధ్య రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
