రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయానికి బోటు సౌకర్యం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి దత్తాత్రేయ స్వామి ఆలయానికి బోటు సౌకర్యం ప్రారంభం

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లిలో మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో గుట్టపై ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లేందుకు బోటు సౌకర్యాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గురువారం ప్రారంభించారు. బోటులో వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో నిత్య పూజలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా బోటును అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, ఆలయ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.