ఇండియా స్క్వాష్‌‌ ప్లేయర్‌ సెంథిల్‌‌కుమార్‌ సంచలనం.. 

ఇండియా స్క్వాష్‌‌ ప్లేయర్‌ సెంథిల్‌‌కుమార్‌ సంచలనం.. 

న్యూఢిల్లీ: ఇండియా స్క్వాష్‌‌ ప్లేయర్‌‌ వేలవన్‌‌ సెంథిల్‌‌కుమార్‌‌.. బుడాపెస్ట్‌‌ ఓపెన్‌‌లో సంచలనం సృష్టించాడు. గురువారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్లో వరల్డ్‌‌ 54వ ర్యాంకర్‌‌, ఎనిమిదోసీడ్‌‌ సెంథిల్‌‌కుమార్‌‌ 11–2, 11–9, 11–8తో వరల్డ్‌‌ 18వ ర్యాంకర్‌‌, టాప్‌‌సీడ్‌‌ ఐన్‌‌ యోవ్‌‌ ఎంగ్‌‌ (మలేసియా)పై గెలిచి సెమీస్‌‌లోకి ప్రవేశించాడు. మ్యాచ్‌‌ ఆరంభం నుంచే బలమైన షాట్లతో గేమ్‌‌లను ఏకపక్షంగా మార్చేశాడు. మరో క్వార్టర్స్‌‌లో మూడోసీడ్‌‌, వరల్డ్‌‌ 38వ ర్యాంకర్‌‌ వీర్‌‌ చోత్రానీ 14–12, 12–14, 11–6, 11–8తో ఆరోసీడ్‌‌ మొహమ్మద్‌‌ ఎల్‌‌షెర్బిని (ఈజిప్ట్‌‌)ను ఓడించాడు. సెమీస్‌‌లో సెంథిల్‌‌కుమార్‌‌, వీర్‌‌ చోత్రానీ తలపడతారు.