ఇండియా అమ్మాయిలకు ఐదో స్థానం

ఇండియా అమ్మాయిలకు ఐదో స్థానం

ఆమ్‌‌స్టెల్విన్‌‌: ఎఫ్‌‌ఐహెచ్‌‌ హాకీ వరల్డ్‌‌ కప్‌‌ను ఇండియా విమెన్స్‌‌ జట్టు ఐదో స్థానంతో ముగించింది. గురువారం జరిగిన వర్గీకరణ పోరులో ఇండియా 3–1 తేడాతో జర్మనీపై గెలిచింది. దాంతో 1974లో నాలుగో స్థానం సాధించిన ఇండియా ఆ తర్వాత ఐదో ప్లేస్‌‌లో నిలవడం ఇదే తొలిసారి. స్టార్టింగ్‌‌ నుంచి ఇరుజట్ల డిఫెన్స్‌‌ అద్భుతంగా ఆడటంతో తొలి అర్ధభాగంలో గోల్స్‌‌ నమోదు కాలేదు. అయితే మూడో క్వార్టర్‌‌లో దూకుడు పెంచిన ఇండియా వరుస గోల్స్‌‌తో హోరెత్తించింది. 43వ నిమిషంలో ఇషిక ఫీల్డ్‌‌ గోల్‌‌ చేయగా, 44వ నిమిషంలో నవ్‌‌నీత్‌‌ పెనాల్టీ కార్నర్‌‌ను గోల్‌‌గా మలిచింది. 47వ నిమిషంలో నవ్‌‌నీత్‌‌ మరోసారి ఫీల్డ్‌‌ గోల్‌‌తో మెరవడంతో ఇండియా 3–0 ఆధిక్యంలో నిలిచింది. స్కోరును సమం చేసేందుకు ఎదురుదాడులకు దిగిన జర్మనీ అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడింది. ఈ క్రమంలో లిన్‌‌ క్రింగ్స్‌‌ (59వ నిమిషం) ఫీల్డ్‌‌ గోల్‌‌తో ఇండియా ఆధిక్యాన్ని 1–3కి తగ్గించాడు. ఆ తర్వాత జర్మనీ ఫార్వర్డ్స్‌‌ను ఇండియా డిఫెన్స్‌‌ సమర్థంగా అడ్డుకోవడంతో గోల్స్‌‌ నమోదు కాలేదు.